Pan Indian Superstars: ఈ ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ ఇద్దరు ఎవరో గుర్తు పట్టారా..?, వీళ్లిద్దరు కూడా ఒక ప్రముఖ తమిళ స్టార్ నటుడికి కొడుకులు. వీళ్లిద్దరు పెద్దయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎవ్వరూ ఊహించని రేంజ్ సక్సెస్ ని చూసి, అనతి కాలంలోనే సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా ఎదిగారు. ఇందులో ఒక బుడ్డోడికి సినిమాలు అంటే మొదట్లో ఆసక్తి ఉండేది కాదు. ఏదైనా పెద్ద వ్యాపారం పెట్టి బిజినెస్ లో రాణించాలని అనుకున్నాడు. ఒక ఫ్యాక్టరీ లో ఉద్యోగిగా ఎన్నో సంవత్సరాలు పని చేసి జీతం తీసుకెళ్ళేవాడు. అలాంటి వ్యక్తి మనసు సినిమాల వైపు మరలింది. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉండడంతో మొదట్లోనే హీరోగా నటించే అవకాశం దక్కింది. కానీ పెద్దగా సక్సెస్ రాలేదు, అలా ఆరంభం లో పరాజయాల తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ ని కొడుతూ అనతి కాలంలోనే సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగాడు.
ఆ బుడ్డోడు మరెవరో కాదు, సూర్య శివకుమార్(Suriya Sivakumar). సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మార్కెట్ ని సంపాదించిన మొట్టమొదటి హీరో. యూత్ ఆడియన్స్ ఈయన సినిమాలకు ఎలా ఎగబడి చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన టాలీవుడ్ ఆడియన్స్ అయితే సూర్య ని తమ సొంత హీరో లాగా భావిస్తూ ఉంటారు. అలాంటి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆయన బ్రాండ్ చెక్కు చెదరలేదు . ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా సౌత్ ని షేక్ చేసే రేంజ్ హిట్ కొడతాడని అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఇక పైన కనిపిస్తున్న ఫోటో లో రెండో బుడ్డోడు ఈయన తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని మొదటి రెండు మూడు సినిమాలతోనే దక్కించుకున్న కార్తీ శివ కుమార్(Karthi Sivakumar).
ఈయనకు కూడా అటు తమిళం లో ఇటు తెలుగు లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈమధ్య కాలం లో వరుసగా సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటూ అన్నయ్యనే మించిన తమ్ముడిగా ఎదుగుతున్నాడు. గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘సత్యం సుందరం’ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన నుండి మరో రెండు సినిమాలు ఈ ఏడాదిలో రాబోతున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే ఈ ఏడాది చివరి నుండి ఆయన లోకేష్ కనకరాజ్ తో కలిసి ‘ఖైదీ 2’ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాకు సౌత్ మొత్తం ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తో కార్తీ తన రేంజ్ ని ఎవ్వరి ఊహలకు అందనంత స్థాయికి తీసుకెళ్లనున్నాడు.