Retro : సూపర్ హిట్ టాక్ వస్తేనే ఈ ఈమధ్య కాలం లో థియేటర్స్ కి ఆడియన్స్ రావడం లేదు, అలాంటిది ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా డీసెంట్ స్థాయి స్టడీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకుపోతున్న చిత్రం ‘రెట్రో'(Retro Movie). తమిళ హీరో సూర్య( Suriya Sivakumar), ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకతం లో వచ్చిన ఈ సినిమా అప్పుడే మొదటి వారం పూర్తి చేసుకుంది. ఈ మొదటి వారం లో ఈ చిత్రం 53 శాతం రీకవరీ ని అందుకుంది. ఈ వీకెండ్ వచ్చే వసూళ్లతో కచ్చితంగా ఫుల్ రన్ 70 శాతం కి పైగా రికవరీ అవుతుందనే ఆశతో ఉన్నారు బయ్యర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ‘రెట్రో’ సినిమా ఛాన్స్ ని తప్పించుకున్న తెలుగు హీరో అతనేనా..? అదృష్టవంతుడు!
తెలుగు థియేట్రికల్ రైట్స్ పది కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఫుల్ రన్ లో మహా అయితే ఇంకో రెండు కోట్ల రూపాయిలు రాబట్టొచ్చు. ఓవరాల్ గా 5 కోట్లు తెలుగు వెర్షన్ లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అదే విధంగా తమిళనాడు లో మొదటి వారం 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో 21 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓపెనింగ్స్ లో కాస్త ఈ ప్రాంతం లో తడబడినా లాంగ్ రన్ లో మాత్రం స్టడీ గా వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక కర్ణాటక లో 10 కోట్ల 20 లక్షల రూపాయిల రాబట్టిన ఈ సినిమా, కేరళలో 4 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
అదే విధంగా హిందీ మరియు ఇతర భాషలకు కలిపి కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా మొదటి వారం లో 86 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 43 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రబీనాట్టింది. చూస్తుంటే ఈ చిత్రం సూర్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచేలా ఉంది. ఆయన గత చిత్రం ‘కంగువా’ వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆ సినిమా కమర్షియల్ గా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ, బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిల్చింది. రెట్రో కూడా ఫుల్ రన్ లో కమర్షియల్ గా ఫెయిల్యూర్ మూవీ, కానీ సూర్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ అవ్వనుంది.
Also Read : ‘రెట్రో’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో ఇంత వసూళ్లు ఊహించలేదు!