Ravi Mohan and Aarthi Ravi : ప్రముఖ తమిళ హీరో జయం రవి(Ravi Mohan), ఆయన సతీమణి ఆర్తి(Aarthi Ravi) విడాకుల వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. ఇప్పటికే వీళ్లిద్దరు ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా ఎన్నో ఆరోపణలు చేసుకున్నారు. ఒక మంచి స్థాయికి ఎదిగిన హీరో కానీ, హీరోయిన్ కానీ, ఇలా వ్యక్తిగత విషయాలను బయట పెట్టి, అది కూడా విడాకుల వ్యవహారం లో రోడ్డు మీదకు రావడం అనేది ఇప్పటి వరకు జరగలేదు అనుకుంట. ఎంతో మంది నీటీనటులు విడాకులు తీసుకొని సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు. అందుకు ఉదాహరణలు ధనుష్-ఐశ్వర్య, సమంత- నాగ చైతన్య జంటలే. కానీ వీళ్ళు మాత్రం పబ్లిక్ గా రోడ్డు మీదకు వచ్చి కొట్టుకుంటున్నారు. పైగా వీళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులా? అంటే అది కూడా కాదు. 15 ఏళ్ళు దాటింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం పిల్లల కోసమైనా వీళ్లకు కలిసి ఉండాలని అనిపించకపోవడం ఆ పిల్లలు చేసుకున్న దురదృష్టం.
Also Read : సింగర్ తో జయం రవి షికార్లు..కన్నీటి పర్యంతం అవుతూ భార్య ఎమోషనల్ పోస్ట్!
ఇదంతా పక్కన పెడితే నిన్న విడాకుల కేసు వ్యవహారం పై ఈ దంపతులిద్దరూ ఫ్యామిలీ కోర్టు లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త నుండి నెలకు 40 లక్షల రూపాయిల భరణం ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం కోర్టు విచారణ జూన్ 12 కు వాయిదా వేసింది. నెలకు 40 లక్షలు జీవితాంతం జయం రవి తన భార్య కి పంపుతూ ఉండేదానికంటే విడాకుల పిటీషన్ ని రద్దు చేసుకొని కలిసి ఉండడం బెటర్ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జయం రవి తమిళనాడు లో ఇప్పుడు పెద్ద స్టార్ ఏమి కాదు. హీరో గా వరుస డిజాస్టర్స్ పడుతుంది లోపు ఆయన మార్కెట్ పతాక స్థాయిలో పడిపోయింది. దీంతో ఇప్పుడు క్యారక్టర్ రోల్స్ చేయడానికి సిద్దమైపోయాడు.
శివ కార్తికేయన్, సుధా కొంగర కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పరాశక్తి’ చిత్రం లో జయం రవి విలన్ గా నటిస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇలాంటి పాత్రలే చేయబోతున్నట్టు తెలుస్తుంది. జయం రవి కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ కి 5 కోట్లకు మించి రెమ్యూనరేషన్ ఎవ్వరూ ఇచ్చే పరిస్థితి లో లేరు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన నెలకు 40 లక్షలు చెల్లించగలడా?, ఆమె డిమాండ్స్ ని చూస్తుంటే జయం రవి కొద్దిరోజుల క్రిందట చేసిన ఆరోపణల్లో నిజముందని తెలుస్తుంది. నా భార్య డబ్బు కోసం నన్నువేధించేది అని, ఆమె ఆడంబరాలకు ఇష్టమొచ్చినట్టు డబ్బు ఖర్చు చేస్తుందని, నన్ను అప్పుల పాలు చేసిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆమె నెలకు 40 లక్షల రూపాయిలు భరణం ఇవ్వాలని డిమాండ్ చేయడాన్ని చూస్తుంటే ఆమె ధన ఆకలి ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : సంక్రాంతి పండుగ రోజున పేరు మార్చుకున్న ప్రముఖ తమిళ హీరో జయం రవి..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!