Jayam Ravi : తమిళ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్న హీరోలలో ఒకరు జయం రవి. ఈయన ప్రముఖ ఎడిటర్ మోహన్ కుమారుడు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించాడు. పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈయన పెద్ద కొడుకు మోహన్ రాజా తమిళం లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు లో ఈయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ‘గాడ్ ఫాదర్’ అనే చిత్రాన్ని చేసాడు. కమర్షియల్ గా ఈ సినిమా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇక మోహన్ రెండవ కుమారుడు జయం రవి(Ravi Mohan). ఈయన విషయానికి వస్తే 2003 వ సంవత్సరంలో ‘జయం’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసాడు. తెలుగు లో నితిన్ హీరో గా నటించిన ‘జయం’ చిత్రానికి ఇది రీమేక్.
Also Read : సంక్రాంతి పండుగ రోజున పేరు మార్చుకున్న ప్రముఖ తమిళ హీరో జయం రవి..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
తెలుగు లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తమిళం లో కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది. అందుకే అందరూ ఆయన్ని జయం రవి అని పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గానే ఆయన తనని అలా పిలవొద్దని, ఇక నుండి నన్ను రవి మోహన్ అని మాత్రమే పిలవాలంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈయన 2009 వ సంవత్సరం లో ఆర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈ దంపతులిద్దరూ విడిపోయారు. వీళ్ళు అలా విడిపోవడానికి కారణం జయం రవి ప్రముఖ సింగర్ కేనీషా తో డేటింగ్ చేయడమే. మొదట్లో మా మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చిన జయం రవి, రీసెంట్ గా ఆమెతో తిరుగుతూ కనిపించిన ఫోటోలు మీడియా కి లీక్ అయ్యాయి. దీనిపై ఆర్తి(Aarthi) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘గత ఏడాది కాలంగా విడాకుల వ్యవహారం గురించి నేనేమి మాట్లాడలేదు, నాకన్నా నా బిడ్డలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే నాపై ఎన్ని ఆరోపణలు చేసినా భరించాను. నేని సైలెంట్ గా ఉన్నానంటే నావైపు నిజం లేదని కాదు, ఈరోజు అసలు నిజమేంటో (రవి, కేనీషా ఫోటోలు) ప్రపంచం మొత్తం చూసింది. 18 ఏళ్లుగా నాతో కలిసి ఉన్న వ్యక్తి ఇలా చేస్తాడని నేను ఊహించలేదు. మా ఇద్దరి విడాకుల వ్యవహారం ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. కొన్ని నెలల నుండి నా పిల్లల బాధ్యతను నేనే చూసుకుంటున్నాను. ఆయన నుండి ఆర్థికంగా కానీ, నైతికంగా కానీ ఎలాంటి సహకారం అందడం లేదు. విడాకులు తీసుకోవడం వల్ల నేను ఎలాంటి బాధపడటం లేదు. కానీ నా కొడుకులిద్దరికి 10 , 14 ఏళ్ళ వయస్సు మాత్రమే. వాళ్లకు కచ్చితంగా భద్రత కలిగించాలి’ అంటూ ఆమె ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
Also Read : ఇంత అందంగా ఉంది.. ఈమె కోసమేనా? ఆ స్టార్ హీరో భార్యను వదిలేసింది.. తాజాగా క్లారిటీ