Homeఎంటర్టైన్మెంట్Music Director Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై భారీ కుట్ర..ఇండస్ట్రీ నుండి తరిమేసేందుకు మాస్టర్...

Music Director Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై భారీ కుట్ర..ఇండస్ట్రీ నుండి తరిమేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన స్టార్ హీరో

ఆయన నుండి ఏదైనా పాట కానీ, టీజర్ కానీ విడుదలైతే సోషల్ మీడియా లో వాటితో పోలి ఉన్న మ్యూజిక్ ట్యూన్స్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి, తమన్ కాపీ కొడుతున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. రీసెంట్ గా ఆయన మహేష్ బాబు 'గుంటూరు కారం' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Music Director Thaman: ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్ కచ్చితంగా టాప్ 2 స్థానం లో ఉంటాడు. తన అద్భుతమైన ట్యూన్స్ తో ప్రతీ సినిమాకి వన్నె తెచ్చే తమన్ ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేత చాలా తీవ్రంగా ట్రోల్ల్స్ కి గురి కాబడుతున్నాడు.

ఆయన నుండి ఏదైనా పాట కానీ, టీజర్ కానీ విడుదలైతే సోషల్ మీడియా లో వాటితో పోలి ఉన్న మ్యూజిక్ ట్యూన్స్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి, తమన్ కాపీ కొడుతున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. రీసెంట్ గా ఆయన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కృష్ణ జయంతి నాడు విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

కానీ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ట్రోల్ల్స్ కి గురి అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ కూడా , పాత సినిమాల నుండి కొట్టేసాడు అంటూ కామెంట్స్ రావడాన్ని తమన్ తీసుకోలేకపొయ్యాడు, అయితే ఆయన పై ఇలా దుష్ప్రచారం జరపిస్తుంది ఒక ప్రముఖ స్టార్ హీరోనే అని తెలుస్తుంది.చాలా కాలం నుండి ఆయనకీ , ఆ హీరో కి మధ్య ఈగో క్లాషెస్ ఉన్నాయి.

అప్పటి నుండి తమన్ పై సోషల్ మీడియా లో ఈ నెగటివ్ క్యాంపైన్ ప్రారంభించాడని, మొన్న తమన్ ఫ్రస్ట్రేషన్ లో ట్విట్టర్ లో వేసిన ట్వీట్స్ మహేష్ బాబు ని ఉద్దేశించి వేసాడు అని అందరూ అనుకున్నారు. కానీ తన గురించి నెగటివ్ ఆర్టికల్స్ రాయించిన ఒక ప్రముఖ స్టార్ హీరో కి కౌంటర్ గానే ఆ ట్వీట్స్ వేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయం ఇంకా బయటపడలేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper