Thaman shocking comments: సౌత్ లో ప్రస్తుతం టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే మనకి గుర్తుకు వచ్చే పేర్లు రెండే. ఒకరు అనిరుద్ రవిచందర్(Anirudh Ravichander), మరొకరు తమన్(SS Thaman). మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి, సూపర్ స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరు ఈ ఇద్దరి కోసమే పోటీ పడుతుంటారు. ఆ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్లిద్దరు. ఈ ఏడాది వీళ్లిద్దరి నుండి వచ్చిన ‘కూలీ’ , ‘ఓజీ’ చిత్రాల్లోని మ్యూజిక్ సౌత్ ఇండియన్ మూవీ లవర్స్ ని ఏ రేంజ్ లో అలరించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఓజీ లేదా కూలీ చిత్రం లోని మ్యూజిక్ మాత్రమే కనిపిస్తోంది. ఆ రేంజ్ లో కుమ్మారు ఈ ఇద్దరు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తమన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘అనిరుద్ తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందినవాడు. కానీ అతనికి టాలీవుడ్ లో అవకాశాలు భారీగా వస్తాయి. పెద్ద పెద్ద టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా నేడు అనిరుద్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అతనికి తెలుగు లో వచ్చినన్ని ఆఫర్స్, నాకు తమిళం లో రావడం లేదు. కారణం తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఒక యూనిటీ ఉంటుంది. మన వాళ్ళే మన సినిమాలకు మ్యూజిక్ ని ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు, కానీ మన టాలీవుడ్ లో అలాంటి యూనిటీ మిస్ అయ్యింది. అందుకే ఇక్కడ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమందికి గడ్డు కాలం నడుస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. తమన్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే రీసెంట్ గానే ఆయన సంగీతం అందించిన అఖండ 2 కి గొప్ప రెస్పాన్స్ రాలేదు. ఇది తమన్ కి కాస్త షాకింగ్ విషయం అనే చెప్పాలి.