spot_img
Homeఎడ్యుకేషన్ఐబీపీఎస్‌ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌.. 10,447 పోస్టులతో..?

ఐబీపీఎస్‌ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌.. 10,447 పోస్టులతో..?

దేశంలోని యువతలో చాలామంది బ్యాంక్ ఉద్యోగాల కొరకు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఐబీపీఎస్ అదిరిపొయే శుభవార్త చెప్పింది. 10,447 పోస్టులతో ఐబీపీఎస్ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో కామర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-ఎక్స్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

జూన్ నెల 8వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా జూన్ 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 10,447 ఖాళీలలో ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) 5096, ఆఫీసర్‌ స్కేల్‌-1 4119, ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) 25, ఆఫీసర్‌ స్కేల్‌-2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) 43 ఉన్నాయి.

ఆఫీసర్‌ స్కేల్‌-2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) 905, ఆఫీసర్‌ స్కేల్‌-2 (ట్రెజరీ మేనేజర్‌) 10, ఆఫీసర్‌ స్కేల్‌-2 (లా) 27, ఆఫీసర్‌ స్కేల్‌-2 (సీఏ) 32, ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) 59, ఆఫీసర్‌ స్కేల్‌- 3 151 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన వారికి రూ.850 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆగష్టు నెలలో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్‌/ అక్టోబర్‌, 2021లో మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper