Homeక్రైమ్‌Tamil Nadu Marriage Dispute: ఉద్యోగం కోసం భార్య దుబాయ్ వెళ్తే.. భర్త మరో దుకాణం...

Tamil Nadu Marriage Dispute: ఉద్యోగం కోసం భార్య దుబాయ్ వెళ్తే.. భర్త మరో దుకాణం తెరిచాడు.. ఇలా దొరికాడు

Tamil Nadu Marriage Dispute: కట్టుకున్న వాడిని ఆమె పూర్తిగా నమ్మింది. ఉద్యోగం వస్తే దుబాయ్ వెళ్ళింది. అతనితో నిత్యం మాట్లాడుతూనే ఉండేది. తన గురించి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. కానీ ఇటీవల కాలంలో భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతడు సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ చేసిన సరే ఎత్తడం లేదు. కొన్ని సందర్భాలలో బిజీ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చింది. ఆమె అనుమానం చివరికి నిజమైంది. […]

Tamil Nadu Marriage Dispute: కట్టుకున్న వాడిని ఆమె పూర్తిగా నమ్మింది. ఉద్యోగం వస్తే దుబాయ్ వెళ్ళింది. అతనితో నిత్యం మాట్లాడుతూనే ఉండేది. తన గురించి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. కానీ ఇటీవల కాలంలో భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతడు సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ చేసిన సరే ఎత్తడం లేదు. కొన్ని సందర్భాలలో బిజీ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చింది. ఆమె అనుమానం చివరికి నిజమైంది. ఆమె కళ్ళతో చూసిన దృశ్యాలతో గుండె బద్దలైపోయింది. దీంతో భర్తను పూర్తి ఆధారాలతో పట్టుకోవాలని డిసైడ్ అయింది. మరో మాటకు తావు లేకుండా దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేసింది. నేరుగా చెన్నై వెళ్ళిపోయింది. చెన్నైలోని ఒక ప్రైవేటు హోటల్లో రూమ్ తీసుకుంది. ఆ తర్వాత భర్త కదలికలను నిత్యం గమనించడం మొదలుపెట్టింది.

అది తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతం. ఇక్కడ అభినయ అనే ఒక యువతి ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగ రావడంతో దుబాయ్ వెళ్లిపోయింది. ఈమెకు గతంలోనే వివాహం జరిగింది. ఆమె భర్త పేరు ఆరుళ్ ప్రసాద్.. ఇతడు వెస్ట్ మాంబళం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇది చెన్నైకి దగ్గరగా ఉండే ప్రాంతం.. అభినయ దుబాయ్ వెళ్లిపోవడంతో ప్రసాద్ మరో దుకాణం తెరిచాడు. మరొక మహిళతో సంబంధం మొదలుపెట్టాడు. సరిగ్గా కొద్ది నెలల క్రితం చెన్నై వచ్చింది అభినయ. భర్త వ్యవహారం తెలిసింది. అతడు గొడవ పడింది.

భర్త వ్యవహారం తెలిసిన ఆమె ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.. వాటిని తన మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసింది. అనంతరం దుబాయ్ వెళ్లిపోయింది. మళ్లీ కొద్దిరోజుల తర్వాత చెన్నై వచ్చింది. ఒక ప్రైవేటు హోటల్లో రూమ్ తీసుకొని ఉంది. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డులను మొత్తం చూసింది. ప్రసాద్ ఒక మహిళను ఇంటికి తీసుకొచ్చినట్టు ఆ వీడియోలో ఆమె గుర్తించింది. మరో మాటకు తావు లేకుండా వెంటనే ఇంటికి వెళ్లిపోయింది. ఆమె రాగానే భర్త వెళ్లిపోయాడు. దీంతో అభినయ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మొబైల్లో ఉన్న ఆధారాలను పోలీసులకు చూపించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper