Homeక్రైమ్‌Shocking Murder Plot Case: భర్త మీద మూడు కోట్ల బీమా.. పది లక్షలకు సుఫారీ.....

Shocking Murder Plot Case: భర్త మీద మూడు కోట్ల బీమా.. పది లక్షలకు సుఫారీ.. ఈ భార్య క్రూరత్వం మాటలకందనిది

Shocking Murder Plot Case: ఆమెకు పెళ్లయింది. భర్త కూడా ఉన్నాడు. భర్త ఇచ్చే సుఖం సరిపోలేదు. పరాయి వ్యక్తి కోసం ఆరాటపడింది. ఆ ఆరాటంలో కట్టుకున్న వాడిని పూర్తిగా మర్చిపోయింది. పైగా అతడిని చంపేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఊరికే చంపడం ఎందుకని బీమా చేయించింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ ప్రాంతానికి చెందిన సాయినికుమార్, ఆయన భార్య భారతి నివాసం ఉంటున్నారు. భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో […]

Shocking Murder Plot Case: ఆమెకు పెళ్లయింది. భర్త కూడా ఉన్నాడు. భర్త ఇచ్చే సుఖం సరిపోలేదు. పరాయి వ్యక్తి కోసం ఆరాటపడింది. ఆ ఆరాటంలో కట్టుకున్న వాడిని పూర్తిగా మర్చిపోయింది. పైగా అతడిని చంపేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఊరికే చంపడం ఎందుకని బీమా చేయించింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది.

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ ప్రాంతానికి చెందిన సాయినికుమార్, ఆయన భార్య భారతి నివాసం ఉంటున్నారు. భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కుమార్ కు తెలిసింది. ఈనేపథ్యంలో అతడు భార్యతో అనేక మార్లు గొడవపడ్డాడు. ఇదే విషయం మీద ఆమెను నిలదీశాడు. దీంతో కుమార్ అడ్డు తొలగించుకోవాలని భారతి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సురేందర్ తో చెప్పింది.

సురేందర్, భారతి కలిసి ప్రణాళిక రూపొందించారు. ఈనేపథ్యంలో కుమార్ మీద వారు రూ.మూడు కోట్లకు బీమా చేయించారు. కొన్ని సంవత్సరాల క్రితం కుమార్, రామ్ మల్లేష్ కు డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో భారతి, సురేందర్ మల్లేష్ ను కలిశారు. కుమార్ ను లేపేసే ప్లాన్ గురించి చెప్పారు. రూ.10 లక్షలకు సుఫారీ మాట్లాడుకున్నారు. గడిచిన నెలలో రూ.రెండు లక్షలను ముందుగా ఇచ్చారు. మల్లేష్, తన స్నేహితుడు శ్రీరామ్ కుమార్ తో కుమార్ ను లేపేయడానికి ప్లాన్ రూపొందించాడు.

ఈనెల 22న మందు తాగుదామని కుమార్ కు మల్లేష్ ఫోన్ చేశాడు. కుమార్ ను ముల్కల్ల గ్రామంలోని శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కుమార్ కు విపరీతంగా మద్యం తాగించారు. అతడు మత్తులో ఉండగా మల్లేష్, శ్రీరామ్ సుత్తెతో గట్టిగా కొట్టారు. అతడు చనిపోయిన తర్వాత రోడ్డు మీద శవాన్ని పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కుమార్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. పోలీసులు సురేందర్, భారతి, మల్లేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, సుత్తి స్వాదీనం చేసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper