https://oktelugu.com/

కరోనా ఎఫెక్ట్.. బెంగళూరు వెళ్లేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ?

దేశంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. ఏపీలో ఈరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు అంతకంతకూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే బెంగళూరుకు రావాలని ఆంక్షలు విధించింది. Also Read: విజృంభిస్తున్న కరోనా .. అక్కడ 10 రోజుల పూర్తిస్థాయి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 25, 2021 / 08:06 PM IST
    Follow us on

    దేశంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. ఏపీలో ఈరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు అంతకంతకూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే బెంగళూరుకు రావాలని ఆంక్షలు విధించింది.

    Also Read: విజృంభిస్తున్న కరోనా .. అక్కడ 10 రోజుల పూర్తిస్థాయి లాక్ డౌన్..?

    కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేకుండా బెంగళూరు నగరానికి వచ్చే ప్రయత్నం చేస్తే అధికారులు అనుమతించరు. కేవలం బెంగళూరు నగరానికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ వెల్లడించారు. బెంగళూరు నగరంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఉన్నారని ఆయన తెలిపారు. నిన్న ఒక్కరోజే బెంగళూరు నగరంలో 1400 కరోనా కేసులు నమోదయ్యాయి.

    Also Read: ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ తో ఆ లక్షణాలకు చెక్..?

    భారీగా కరోనా కేసులు నమోదు కావడంతో మంత్రి సుధాకర్ ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. కేరళ, పంజాబ్, ఛండీగఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. గతంలో తల్లిదండ్రులు మాత్రమే కరోనా బారిన పడేవారని ఇప్పుడు పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారని ఆయన తెలిపారు.

    పెద్దపెద్ద భవన సముదాయాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని మంత్రి సుధాకర్ కోరారు.