దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తాజాగా కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రత్యేక గృహ రుణ ఉత్పత్తి గృహ వరిష్ట కింద ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏకంగా ఆరు నెలల ఈఎంఐ మాఫీని ప్రకటించింది.
Also Read: బంగారం ఉన్నవారికి శుభవార్త.. వడ్డీ పొందే ఛాన్స్..?
హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేస్తే 48 నెలల తర్వాత అసలు కట్టాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగం కరోనా వల్ల ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. లోన్ మంజూరు కాగానే ఎటువంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల రుణాలు తీసుకున్న వాళ్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొంటే . బిల్డర్ నుంచి మీరు ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను తీసుకొని ఆరు ఈఎంఐలను మాఫీ చేస్తుంది. 37, 38, 73, 74, 121, 122 ఈఎంఐలను మినహాయించడం జరుగుతుంది. ఇదే సమయంలో పెన్షనర్లకు ప్రయోజనం చేకూరేలా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ స్పెషల్ స్కీమ్ ను అమలు చేస్తోంది. గృహ వరిష్ట పథకం కోసం పెన్షన్ సదుపాయం ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ లో బ్యాంకు సెలవులు ఇవే..?
ఖచ్చితమైన పెన్షన్ సదుపాయాన్ని కలిగి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ స్కీమ్ అమలవుతోంది. 700 కంటే ఎక్కువగా సిబిల్ స్కోరు ఉన్నవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 6.90 శాతానికే లోన్ పొందే అవకాశం ఉండటం గమనార్హం.