https://oktelugu.com/

ఎన్నికల్లో గెలిపిస్తే.. మనిషికి రూ.కోటి, హెలిక్యాప్టర్.. చంద్రమండలంపైకి

తమిళనాడు ఎన్నికల సందర్భంగా చేతికి ఎముకే లేనట్టు ఎమ్మెల్యే అభ్యర్థులు హామీలిస్తున్నారు. అసలు వాటిని నెరవేరుస్తామా? లేదా అని కూడా ఆలోచించకుండా ప్రజలకు నోటికొచ్చిన హామీలిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి మీదకు ఒక రోవర్ ను కూడా దిగ్విజయంగా దించలేదు. కానీ దక్షిణ మధురై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి శరవణన్ ఏకంగా తనను గెలిపిస్తే చంద్రమండలంపైకి పర్యటన తీసుకెళ్తానని హామీ ఇవ్వడం విశేషం. ఇంతవరకు ప్రపంచంలోనే ఎవ్వరూ చంద్రుడిపైకి […]

Written By: , Updated On : March 25, 2021 / 07:50 PM IST
Follow us on

తమిళనాడు ఎన్నికల సందర్భంగా చేతికి ఎముకే లేనట్టు ఎమ్మెల్యే అభ్యర్థులు హామీలిస్తున్నారు. అసలు వాటిని నెరవేరుస్తామా? లేదా అని కూడా ఆలోచించకుండా ప్రజలకు నోటికొచ్చిన హామీలిస్తున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి మీదకు ఒక రోవర్ ను కూడా దిగ్విజయంగా దించలేదు. కానీ దక్షిణ మధురై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి శరవణన్ ఏకంగా తనను గెలిపిస్తే చంద్రమండలంపైకి పర్యటన తీసుకెళ్తానని హామీ ఇవ్వడం విశేషం. ఇంతవరకు ప్రపంచంలోనే ఎవ్వరూ చంద్రుడిపైకి యాత్రలకు వెళ్లకున్నా ఈయన ఈ హామీ ఇవ్వడం సంచలనమైంది. యువతకు కోటి రూపాయాలతోపాటు ప్రతీ ఇంటికి ఒక ఐఫోన్ , కారు, హెలికాప్టర్, రోబో ఇస్తానని.. స్విమ్మింగ్ ఫూల్ ఉన్న ఇళ్లు కానుకగా ఇస్తానని ఇతగాడు హామీ ఇవ్వడం విశేషం.

ఇవేకాదు.. ఇక బీజేపీ తరుఫున నిలబడ్డ మొదకురిచి అభ్యర్థి అయితే నియోజకవర్గంలో మోకాళ్ల నొప్పుల సమస్య బాగా ఉందని అందరికీ ఆ ఆపరేషన్ ఉచితంగా చేయిస్తానని.. జల్లికట్టు కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు.

ఇలా తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్ర ఎన్నికల హామీలు ఓటర్లను షాక్ కు గురిచేస్తున్నాయని.. నమ్మించే హామీలు కాకుండా నోటికి ఏది వస్తే అదిచెబుతూ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు.