Site icon OkTelugu

SS Rajamouli Varanasi Movie Fight Sequence: రాజమౌళి ‘వారణాసి’ మూవీ ఫైట్ ను ఎన్టీఆర్ కి చూపించాడా..? అది చూసి తారక్ ఏం చెప్పాడంటే..?

SS Rajamouli Varanasi Movie Fight Sequence

SS Rajamouli Varanasi Movie Fight Sequence

SS Rajamouli Varanasi Movie Fight Sequence: సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ని సాధించడానికి చాలామంది దర్శకులు నానా తంటాలు పడుతుంటే రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రం చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ఆయన లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరన్నది వాస్తవం…ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన నాలుగు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. తొందరలోనే ఐదో షెడ్యూల్స్ కి సైతం ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి, వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు…తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడా? మధ్యలో ఏవైనా డిస్టాబెన్సెస్ వస్తున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫైట్ సీక్వెన్స్ ని మూడో షెడ్యూల్లో తెరకెక్కించారు.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆ ఫైట్ సీక్వెన్స్ ని చూశారట. ఇక దానిమీద ఎన్టీఆర్ ఎలా స్పందించాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది… ఆ ఫైట్ అయితే ఎన్టీఆర్ కి విపరీతంగా నచ్చేసిందట.

సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సిజీ వర్క్ అవ్వలేదు. కానీ ఎడిట్ అయిన ఆ ఫైట్ ను మాత్రమే చూసిన ఎన్టీఆర్ అంత ఎగ్జిట్ అవుతున్నాడు అంటే ఆ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటూ కొంతమంది ప్రేక్షకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…

ఇక జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలను అంత ఆషామాషీగా వదిలిపెట్టడనే విషయం మనకు తెలిసిందే. ఇక పాన్ వరల్డ్ లో తీస్తున్నాడు అంటే ఈ సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు… ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? ప్రపంచ స్థాయిలో రాజమౌళికి మహేష్ బాబు కి గొప్ప పేరు తీసుకొచ్చి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Exit mobile version