Homeకరోనా వైరస్Covid Virus: వైరస్ వస్తే మరణమే.. మళ్లీ ప్రపంచానికి ‘చైనా’ వైరస్ భయం

Covid Virus: వైరస్ వస్తే మరణమే.. మళ్లీ ప్రపంచానికి ‘చైనా’ వైరస్ భయం

Covid Virus: మొన్నటిదాకా కోవిడ్ వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతులమైంది.. ప్రపంచంలో అన్ని దేశాల్లో విడతలవారీగా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ఆ వైరస్ వ్యాప్తి ముందుగా మొదలైన చైనాలో మాత్రం ఆంక్షలు నిరాటంకంగా కొనసాగాయి. ఏడాది క్రితం వరకు కూడా అక్కడ ఆంక్షలు కొనసాగాయి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఈ వైరస్ ను డ్రాగన్ దేశం సృష్టించిందని, దానిని ప్రపంచ దేశాలపైకి జీవ విధంగా ప్రయోగించాలని భావించిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విమర్శలపై చైనా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చింది. తాము అలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేయలేదని కొట్టి పారేసింది. అయితే కోవిడ్ భయాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ముఖ్యంగా చైనా రాజధాని నగరం బీజింగ్, వ్యూహాన్ నగరం ఇప్పుడిప్పుడే బాహ్య సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయి. 2020, 2021 లో కోవిడ్_19 విశ్వరూపం చూపించిన తర్వాత 2022, 2023 లో వివిధ రకాల కోవిడ్ మ్యూటేషన్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అవి అంతగా ప్రభావం చూపించలేదు. లక్షణాలు స్వల్పంగా ఉండటం, పదికి కంటే తక్కువగానే మరణాలు నమోదు కావడంతో ఎవరూ ఈ వైరస్ మ్యూటేషన్ల గురించి భయపడలేదు. అయితే తాజాగా మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్ పై బీజింగ్ ప్రయోగాలు చేస్తున్నట్టు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలుతున్నాయి. అయితే ఆ వైరస్ వ్యాప్తి చెందితే.. మరణాల రేటు 100% గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ వైరస్ పై వ్యూహాన్ లో ఒక అధ్యయనం జరిపారని.. ఇప్పుడు ఆ విషయం బయటపడిందని సదరు కథనాల్లో తెలుస్తోంది. ఆ అధ్యయన వివరాల ప్రకారం సార్స్ కోవ్_2 కు చెందిన జీ ఎక్స్ పీ _2 వీ అనే ఉపరకంపై డ్రాగన్ దేశ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది 2017 లో వెలుగు చూసిన జి ఎక్స్ ఉత్పపరివర్తనమని సమాచారం. ఇది మలేషియాలోని పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. జీ ఎక్స్ పీ _2 వీ మ్యూ టే టెడ్ వెర్షన్ ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే వాటిపై ఈ వైరస్ తీవ్రమైన ప్రభావం చూపించిందని.. ఎనిమిది రోజుల్లోనే అవి చనిపోయాయని ఓ అధ్యయనంలో వెళ్లడైంది. ఈ వైరస్ కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్ళు, మెదడు దెబ్బతిన్నాయని ఆ అధ్యయనంలో తేలింది. వైరస్ ప్రయోగించిన కొన్ని రోజుల్లోనే ఎలుకల బరువు తగ్గిందని.. మరి కొద్ది రోజులకు అవి నడవలేని స్థితికి చేరుకున్నాయని ఆ అధ్యయనంలో తెలుస్తోంది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని సమాచారం. అయితే ఎలుకల మాదిరిగా మనుషులపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపిస్తుందా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. మనుషుల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జీ ఎక్స్ పీ _2 వీ వైరస్ తో మనుషులకు పెనుముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన వైరస్ తో డ్రాగన్ దేశ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ప్రయోగాలతో వుహాన్ ల్యాబ్ కు ఎటువంటి సంబంధం లేదని సమాచారం. అయితే ఇక్కడి ల్యాబ్ నుంచే లీక్ అయిన కరోనా వైరస్ 2020, 2021 సంవత్సరాలలో ప్రపంచంలో ఎంతటి ఉత్పాతం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ వార్తలను ఎప్పటిలాగానే చైనా కొట్టి పారేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version