https://oktelugu.com/

Corona: దేశంలో కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలుంటే డేంజర్ లో ఉన్నట్టే

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. పండుగ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 23, 2023 / 12:50 PM IST

    Corona

    Follow us on

    Corona: భారతదేశంలో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి కలవరపాటుకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా మహామ్మారి గతంలో పంజా విసరడం తో ఎంతో మంది మృత్యువాతపడ్డారన్న సంగతి తెలిసిందే.
    ఇక కరోనా అంతం అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్ -1 కేసులు భారత్ లో కనిపిస్తున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. పండుగ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా పాటించాలని తెలిపింది.. కొత్త వేరియంట్ స్పీడ్ గా వ్యాప్తి చెందుతున్నప్పటికీ అంత ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

    దేశంలో పలు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్రమత్తం అయ్యాయి. తెలంగాణలో సైతం కేసుల సంఖ్య అధికమవుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని నిలోఫర్ వైద్యులు తెలిపారు. అయితే వీరికి న్యూమోనియా లక్షణాలు ఉన్నాయని చెప్పారు. సాధారణంగా రెండేళ్ల లోపు చిన్నారులతో పాటు 65 ఏళ్లు పైబడిన వృద్దులపై న్యూమోనియా ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే కరోనా కొత్త వేరియంట్ సోకిన వారికి తేలికపాటి పొడిదగ్గు, జ్వరంతో పాటు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే కరోనా వలను కూడా న్యూమోనియా సోకుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జలుబు, జ్వరం లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.