spot_img
Homeకరోనా వైరస్కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు శుభవార్త.. వైరస్ సోకదట..?

కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు శుభవార్త.. వైరస్ సోకదట..?

కరోనా వైరస్ బారిన పడిన వాళ్లకు యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ద లాన్సెట్‌ హెల్దీ లాంగెవిటీ పేరుతో శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టగా ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజా అధ్యయనంలో ఒకసారి కరోనా సోకిన వాళ్లకు మరోసారి వైరస్ సోకే అవకాశాలు తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో సహజ రోగనిరోధకత పది నెలల పాటు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

2,111 మందిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. కోవిడ్‌ యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించి ఒకసారి కరోనా వచ్చి ఇళ్లలో ఉంటున్నవారికి రీ-ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 85%, వైద్య సిబ్బందికి 60% తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూసీఎల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఇన్‌ఫార్మేటిక్స్‌ పరిశోధనకర్త మరియా రుతికోవ్‌ దాదాపు 10 నెలల పాటు వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లే ఒక విధంగా అదృష్టవంతులని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడిన వాళ్లు సెకండ్ వేవ్ లో వైరస్ బారిన పడలేదని కోలుకున్న వాళ్లలో పెరిగిన యాంటీబాడీల ప్రభావం వల్లే కరోనా రెండోసారి సోకలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనాని ఒకసారి జయించినవారిలో కేవలం 14 మందికే 2,111 మందిలో కరోనా సోకింది.

మరోవైపు కరోనా ఇప్పటివరకు సోకని వాళ్లు వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే దాదాపు ఏడాది పాటు వైరస్ నుంచి రక్షణ కలిగే అవకాశం ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Pawan Kalyan And Allu Arjun

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...
Spirit Movie

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...
Chiranjeevi And Pawan Kalyan

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Oktelugu Epaper