
గ్లామర్ బ్యూటీ ‘రకుల్ ప్రీత్ సింగ్’కి ఖాళీగా ఉంటే అసలు నచ్చదు అట. అందుకే, జిమ్ వ్యాపారం పెట్టింది. రోజులో ఖాళీ టైం దొరికినప్పుడల్లా తన జిమ్ బిజినెస్ లెక్కలు చూసుకుంటుందట. ఏది ఏమైనా ఈ భామ మాత్రం యామా స్పీడ్ అంటున్నారు ఆమెతో పని చేసిన ఫిల్మ్ మేకర్స్. ఎంత స్పీడ్ కాకపోతే, కేవలం నాలుగేళ్లలోనే పదుల సినిమాలు పూర్తి చేస్తోంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక్కతే సెట్ కి వచ్చి.. సినిమాలు చేసుకునే హీరోయిన్ కూడా రకులేనట. అందుకే రకుల్ అంటే.. నిర్మాతలకు కూడా ప్రత్యేక అభిమానం.
ఆమెకు అయ్యే హోటల్ బిల్స్ కూడా చాల తక్కువుగా ఉంటాయట. అనవసరంగా ఖర్చు చేయడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు. మొత్తానికి రకుల్ లైఫ్ స్టైల్ కూడా చాలా పద్దతిగా ఉంటుందని.. పబ్ లు, కల్చరల్ ఈవెంట్స్ అంటూ ఆమె దేనికి ఎక్కువ ఖర్చు పెట్టదు అని తెలుస్తోంది. ఇక ఈ మధ్య ఈ అమ్మడికి సరైన హిట్ రాలేదు. దాంతో కాస్త అవకాశాలు తగ్గాయి. అయినా సరే మళ్ళీ అవకాశాల కోసం కాస్త గ్లామర్ డోస్ పెంచటానికి రెడీ అవుతుంది.
పైగా సినిమా ఒప్పుకునే విషయంలో కూడా ఆమె ఎక్కువగా నాన్చను అంటుంది. కేవలం ఐదే నిమిషాల్లోనే తన అభిప్రాయం చెప్పేస్తానని.. హీరోయిన్స్ కోసం వెతికే డైరెక్టర్స్ తనను అప్రోచ్ అవొచ్చు అంటూ మొత్తానికి ఇండస్ట్రీలో ఒక మెసేజ్ ను పాస్ చేసింది రకుల్. అంటే.. ఇన్ డైరెక్ట్ గా ఛాన్స్ ఇవ్వండి నటించేస్తా అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది అన్నమాట. మరి స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతున్న దర్శకులు ఎవరైనా ఉంటే రకుల్ దగ్గరకి వెళ్లి కథ చెప్పొచ్చు.
కథ ఎలా ఉన్నా.. రెమ్యునరేషన్ కోసమైనా అమ్మడు సినిమా ఒప్పుకునేలా ఉంది కాబట్టి.. దర్శకులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక రకుల్ చెప్పినట్టు ఇదే స్పీడ్ మైంటైన్ చేస్తూ.. సినిమాలు చేస్తే.. మరో రెండేళ్లకే మరో డజను సినిమాలు చేస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న రకుల్, చాల ప్లాన్డ్ గానే కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది.