
సినిమా హీరోయిన్ల మనస్తత్వం భలే విచిత్రంగా ఉంటుంది. ఏ మాత్రం అవకాశాలు తగ్గినా సరే.. వెంటనే ఫోటో షూట్ లకు రెడీ అయిపోతారు. అయినా కాస్త ఆఫర్లు తగ్గగానే.. బికినీలు, టాప్ లెస్ లతో ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో ఎందుకు విరుచుకుపడతారో గాని, ఆ ఎక్స్ పోజింగ్ చూసి వారికి ఛాన్స్ లు వస్తాయా అంటే అందులో ఏ మాత్రం నిజం లేదు. హీరోయిన్లకు ఈ విషయం ఎప్పుడు అర్ధమవుతుందో గాని, వారు ఇప్పటికైనా మారితే బెటర్. హాట్ హాట్ ఫోజులతో నానా రచ్ఛ చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ పెద్ద హంగామా రేపుతూ పోతే.. ఐటమ్ సాంగ్స్ కి అడుగుతారు తప్పితే.. మెయిన్ హీరోయిన్ గా పరిగణలోకి తీసుకోరు అనే విషయాన్ని ఈ అందాల భామలు తెలుసుకోవాలి.
గత కొన్ని సంవత్సరాలుగా ఏ హీరోయిన్ ని చూసిన ఇదే స్ట్రాటజీతో ముందుకు పోతుంది. మాట్లాడితే.. ఈ మధ్య బికినీల్లో రచ్చ చేయడం కామన్ అయిపోయింది.
తమకు కావాల్సిన పబ్లిసిటీని కూడా హాట్ నెస్ ను గుమ్మరించి తెచ్చుకోవడం బాగా అలవాటు చేసుకున్నారు. లేకపోతే ఎప్పుడూ హద్దులు దాటని ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, రీతూ వర్మ లాంటి హీరోయిన్స్ కూడా హాట్ ఫోజులతో రచ్చ చేస్తూ రసిక హృదయాలను కొల్లగొడుతున్నారు. ఇలా రెచ్చిపోతున్న హీరోయిన్ల వెనుక ఉంటున్న కామన్ పాయింట్ ఒక్కటే. పలు చిత్రాల్లో నటించినా సరైన సక్సెస్ రాని హీరోయిన్ల అంతా గుడ్డిగా ఫాలో అవుతోన్న ఏకైక ఫార్ములా ఎక్స్ పోజింగ్.
అలాగే మంచి అవకాశాల కోసం ఇప్పటికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయిన హీరోయిన్లు కూడా ఇప్పుడు హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకున్నారు. ఎంతగా ఎక్స్ పోజింగ్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యారంటే.. కేవలం విహార యాత్రల పేరుతో వెళ్తూ.. అక్కడ బికినిలో హాట్ హాట్ గా ఫోజులిచ్చి.. ఆ ఫోటోలను ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకుంటూ మేకర్స్ కు పరోక్షంగా నేను ఇంకా గ్లామర్ డాల్ గానే ఉన్నాను అంటూ మెసేజ్ లు పాస్ చేస్తున్నారు. ఇలా చేసి ఛాన్స్ సాధిస్తున్న వారు మాత్రం బహు అరుదు అట.