Heroines : ఒకప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు సినీ ఇండస్ట్రీ లోకి రావాలంటే ఎన్నో కష్టాలు, అడ్డంకులు దాటుకొని రావాల్సి వచ్చేది. వందల మంది మధ్యలో ఆడిషన్స్ లో పాల్గొని ఒక సినిమాకు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ. ఇప్పుడు సోషల్ మీడియా బాగా వృద్హి చెందడంతో టాలెంట్ ఉన్నవాళ్లు ఇండస్ట్రీ లోని పెద్దల కంటపడి సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా వీళ్ళు మన మేకర్స్ ని తెగ ఆకర్షిస్తున్నారు. అలా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయ్యి, సినిమాల్లో హీరోయిన్స్ గా అడుగుపెట్టిన వాళ్ళ గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాం.
Also Read : పోలీసుల విచారణకు హాజరు కానున్న తమన్నా, కాజల్ అగర్వాల్..చిక్కుల్లో పడిన హాట్ బ్యూటీస్!
శ్రీదేవి(Sridevi):
రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన కోర్ట్(Court Movie) సినిమాలో హీరోయిన్ ఈమె. ఈమెకు ఈ సినిమా అవకాశం ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారానే వచ్చింది. డైరెక్టర్ రామ్ జగదీశ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ఇన్ స్టాగ్రామ్ లో శ్రీదేవి రీల్స్ నేను బాగా అనుసరిస్తూ ఉంటాను. ఆ అమ్మాయి ముఖం లో మంచి ఎక్స్ ప్రెషన్స్ పలకడాన్ని నేను గమనిస్తూ వచ్చాను. కోర్ట్ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నాకు కొత్త హీరోయిన్ కావాలని అనిపించినప్పుడు శ్రీదేవి తప్ప నాకు ఎవ్వరూ గుర్తుకు రాలేదు. వెంటనే ఆమెని సంప్రదించి ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఈమెని ప్రత్యేకంగా ఆడిషన్ కూడా చేశారట. కోర్ట్ చిత్రం లోని ఒక డైలాగ్ ని ఇచ్చి మంచి ఎమోషన్ తో చెప్పమని అడగ్గా, ఆమె సింగిల్ టేక్ లో చేసిందని సమాచారం.
ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi Ismael):
ప్రభాస్(Rebel Star Prabhas), హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ'(Fauji Movie) చిత్రం లో హీరోయిన్ గా ఈమె వెండితెర అరంగేట్రం చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ఎన్నో వందల రీల్స్ ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించింది. డైరెక్టర్ హను రాఘవపూడి తన సినిమా కోసం కొత్త హీరోయిన్ ని వెతుకుతున్న సమయంలో ఇమాన్వి రీల్ ఇన్ స్టాగ్రామ్ లో ఆయనకు ఒకటి కనిపించింది. దానిని చూసి ఎంతో ఆకర్షితుడైన హను రాఘవపూడి, వెంటనే తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఒక్క సినిమా అనుభవం కూడా లేకుండా, కేవలం ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఏకంగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేయడం సాధారణమైన విషయం కాదు.
సాక్షి వైద్య (Sakshi Vaidya):
అక్కినేని అఖిల్(Akkineni Akhil) కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఏజెంట్'(Agent Movie) చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది సాక్షి. 2023 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ సాక్షి వైద్య కి మాత్రం మంచి పేరొచ్చింది. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆమె వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గాండీవ దారి అర్జున’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వడంతో ఆమె మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు.
Also Read : ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను ఎక్కువగా వాడుతున్న ఆ స్టార్ హీరో ఎవరంటే..?