Allu Arjun heroines now: టాలీవుడ్ లో అంచలంచలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని కెరీర్ ప్రారంభం లోనే సంపాదించుకొని నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్న హీరోలలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ మొదటి సినిమా నుండే తన సొంత టాలెంట్ తో శభాష్ అనిపించుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. పైకి ఎదగాలి అనే తపన, కసి ఉంటే ఎవరైనా అల్లు అర్జున్ రేంజ్ కి ఎదగగలరు అని పెద్దలు సైతం ఆయనని ఉదాహరణగా తీసుకొని చెప్పే స్థాయికి ఎదిగాడు. అంత బాగానే ఉంది కానీ, అల్లు అర్జున్ కెరీర్ లో ఒకే ఒక్క బ్యాడ్ రిమార్క్ ఉంది. అదేమిటంటే ఆయనతో కలిసి ఎవరైనా కొత్త హీరోయిన్ నటిస్తే ఆమె అడ్రస్ లేకుండా పోతుంది అని.
Also Read: స్పిరిట్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందా..? ఫ్యాన్స్ కి పండగేనా..?
మొదటి సినిమా నుండి ఇది గమనిస్తే మీ అందరికి అర్థం అవుతుంది. ‘గంగోత్రి’ సినిమా ద్వారా ఆర్తి అగర్వాల్ సోదరి అధితి అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ, సక్సెస్ మాత్రం అందుకోలేదు. దీంతో ఆమె ఇండస్ట్రీ లోకి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది. ఇక రెండవ సినిమా ‘ఆర్య’ హీరోయిన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా అప్పట్లో యూత్ ఆడియన్స్ లో ఒక ప్రభంజనమే సృష్టించింది. టాలీవుడ్ లవ్ స్టోరీస్ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా అను అగర్వాల్ నటించింది. ఆమెకు కూడా అందం పరంగా, నటన పరంగా మంచి పేరొచ్చింది. అలా వచ్చిన క్రేజ్ తో ఆమె రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ, విజయాలు మాత్రం వరించలేదు.
Also Read: ఇదేమి మేకోవర్ బాబోయ్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన బుచ్చి బాబు!
దీంతో ఆమె కెరీర్ కూడా తొందరగానే ముగిసిపోయింది. ఇక ‘బన్నీ’ మూవీ హీరోయిన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇందులో గౌరీ ముంజల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తర్వాత ఆమె చేసిన రెండు మూడు సినిమాల్లో ఒకటి హిట్ అయ్యింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈమె కూడా మాయమైపోయింది. ‘దేశముదురు’ ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా హన్సిక ఒక్కటే సక్సెస్ అయ్యింది. ఇక ఆ తర్వాత పరుగు సినిమాలో నటించిన హీరోయిన్ షీలా, వరుడు మూవీ హీరోయిన్ భానుశ్రీ ,వేదం మూవీ హీరోయిన్ దీక్షా సేత్ ఇలా ఎంతో మంది హీరోయిన్స్ అల్లు అర్జున్ సినిమా ద్వారా పరిచయం అవ్వడం, ఆ తర్వాత మాయం అయిపోవడం సర్వసాధారణంగా మారింది. అందుకే కొత్త హీరోయిన్స్ కి అల్లు అర్జున్ సినిమా అంతగా కలిసి రాదనీ విశ్లేషకులు అంటూ ఉంటారు.