spot_img
Homeసినిమా వార్తలుబన్నీ పై క్రష్‌ అట.. విజయ్ దేవరకొండ చిల్ అట !

బన్నీ పై క్రష్‌ అట.. విజయ్ దేవరకొండ చిల్ అట !

Priyanka Jawalkar Have Crush On Allu Arjun‘ప్రియాంక జవాల్కర్‌’ అచ్చ తెలుగు హీరోయిన్. ఐతే, మన తెలుగు అమ్మాయి కావడం వల్లే అమ్మడుకి అవకాశాలు రావడం లేదు అని ఓ అపవాదు ఉన్నప్పటికీ.. ఈ భామ మాత్రం చక్కగా నటిస్తోంది. ఇప్పటికే మంచి నటి అనిపించుకుంది. కాకపోతే హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఆమెలో లేదు అని, అన్నిటికీ మించి బరువు కూడా బాగా పెరిగిపోయిందని ఈ మధ్య తరుచూ ఆమె పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ లో ఈ బ్యూటీ హీరోయిన్‌ గా రాణించడం కష్టం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా వరుస ఛాన్స్ లను అందుకుని హీరోయిన్ గా ఈ నెలలో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తిమ్మరుసు, ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక చేతిలో ప్రస్తుతం మరో తమిళ సినిమా కూడా ఉంది.

అలాగే ఆనంద్ దేవరకొండ సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. బన్నీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు హీరో అల్లు అర్జున్‌ అంటే విపరీతమైన ఇష్టం అని, ముఖ్యంగా బన్నీ స్టైల్ ను చాలా ఇష్టపడతాను అని, ఎప్పటికైనా బన్నీతో కలిసి నటించాలని ఉందని ప్రియాంక చెప్పుకొచ్చింది.

పైగా అల్లు అర్జున్ పై ఎప్పటి నుండో తనకు క్రష్‌ ఉంది అని కూడా ప్రియాంక తెలిపింది. అయినా ఉన్నట్టు ఉంది. ‘ప్రియాంక జవాల్కర్‌’ అల్లు అర్జున్ పై ఎందుకు పొగడ్తల వర్షం కురిపిస్తోంది ? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెనే క్వశ్చన్ చేస్తున్నారు. ఇక పనిలో పనిగా ప్రియాంక, విజయ్‌ దేవరకొండను కూడా పొగడుతూ.. విజయ్ ఎప్పుడు చిల్‌ గా ఉంటాడని, తనను ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటాను అని ఆమె చెప్పుకొచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper