Homeబిజినెస్Xiaomi Redmi Turbo 5: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజుల బ్యాకప్.. షావోమి కొత్త...

Xiaomi Redmi Turbo 5: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజుల బ్యాకప్.. షావోమి కొత్త ఫోన్.. ఈరోజే విడుదల..

Xiaomi Redmi Turbo 5: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షావోమి (Xiaomi) తన సరికొత్త మొబైల్ ను తీసుకురాబోతోంది. దీనిని ఒక రకంగా పవర్‌హౌస్ మొబైల్ అనుకోవచ్చు. ఈ కంపెనీ నుంచి రెడ్‌మీ టర్బో 5 (Redmi Turbo 5) ను జూన్ 16న మార్కెట్లోకి అధికారికంగా వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) వేదికగా విక్రయాలు జరుపుకుంటున్న ఈ ఫోన్, ముఖ్యంగా ఛార్జింగ్ సమస్యలతో విసిగిపోయిన యూజర్లను టార్గెట్ చేస్తూ అల్టిమేట్ ఫీచర్లతో దూసుకొచ్చింది. ఎందుకంటే ఇందులో బలమైన బ్యాటరీ తో పాటు ఫాస్టెస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేసే సౌకర్యం ఉంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో సైతం గరిష్టంగా 5000mAh లేదా 6000mAh బ్యాటరీలను మాత్రమే చూస్తుంటాం. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెడ్‌మీ టర్బో 5 లో ఏకంగా 7,540mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు 2 నుండి 3 రోజుల పాటు నిరంతరాయంగా బ్యాకప్ అందిస్తుంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ ఏమాత్రం బరువుగా లేదా లావుగా లేకుండా కేవలం 8.18 mm మందంతో చాలా స్లిమ్‌గా డిజైన్ చేయడం షావోమి సాధించిన సాంకేతిక విజయంగా చెప్పవచ్చు.

భారీ బ్యాటరీ అనగానే ఛార్జింగ్ అవ్వడానికి గంటల సమయం పడుతుందని కంగారుపడాల్సిన అవసరం లేదు. దీని కోసం బాక్స్‌లోనే 100W హైపర్‌ఛార్జ్ అడాప్టర్‌ను అందించారు. దీని ద్వారా కేవలం అర గంటలోనే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇందులో 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీ స్నేహితుల ఫోన్లు లేదా బ్లూటూత్ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ అయిపోతే, ఈ ఫోన్‌ను ఒక పవర్ బ్యాంక్‌లా వాడుకుని వాటిని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్లో సరికొత్త MediaTek Dimensity 8500 Ultra ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది హెవీ గేమింగ్ తో పాటు మల్టీటాస్కింగ్‌ను ఉపయోగించేవారికి చాలా అనుగుణంగా ఉంటుంది. దీనికి తోడు అల్ట్రా-ఫాస్ట్ LPDDR5X RAM మరియు UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల యాప్స్ ఓపెన్ అవ్వడం, గేమ్స్ లోడ్ అవ్వడం రెప్పపాటు కాలంలో జరిగిపోతాయి.

వీడియోలు మరియు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉండేలా ఇందులో 6.59 అంగుళాల AMOLED డిస్ ప్లే ను అమర్చారు. 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ ను అందించే ఈ ఫోన్ లో 3500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది కాబట్టి ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌తో పాటు, కెమెరా మాడ్యూల్ చుట్టూ అమర్చిన RGB లైటింగ్ రింగ్స్ ఈ ఫోన్‌కు సరికొత్త గేమింగ్ మరియు స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. మెటల్ ఫ్రేమ్‌తో కూడిన ఈ డివైజ్‌కు కఠినమైన IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.

ఇందులో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇది Sony IMX882 సెన్సార్ మరియు OIS సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల ప్రయాణాల్లో మరియు రాత్రి వేళల్లో కూడా కదల్లేని, స్పష్టమైన ఫోటోలు, 4K వీడియోలు తీసుకోవచ్చు. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, మరియు సెల్ఫీల కోసం ముందు వైపు 20MP కెమెరా ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper