Sony Bravia theatre Trio: సినిమాలు చూడడం.. వెబ్ సిరీస్ లు ఆస్వాదించడం.. ఇష్టమైన పాటలు వినడం.. ఇలా వినోదానికి సంబంధించి ప్రతి విషయంలోనూ సౌండ్ క్వాలిటీ కీలక పాత్ర పోషిస్తుంది. టీవీల్లో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ ఉన్నప్పటికీ.. థియేటర్స్ స్థాయి ఆడియో అనుభూతి మాత్రం ప్రత్యేకమైన హోమ్ థియేటర్ సిస్టంతోనే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ తన ప్రీమియం ఆడియో విభాగంలో Sony Bravia theatre Trio ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.
మూడు యూనిట్లలో ఈ హోమ్ థియేటర్ సిస్టం లభ్యం అవుతుంది. పెద్ద స్క్రీన్ టీవీలను ఉపయోగించే వారి కోసం రూపొందించారు.. dolby atmos, DTS IMAX enhanced వంటి ఆధునిక ఆడియో టెక్నాలజీ తో పాటు 360 spatial sound mapping సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఈ హోమ్ థియేటర్ ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి.. ధర ఎంత ఉంది.. ఈ కథనంలో తెలుసుకుందాం.
మూడు యూనిట్లతో ప్రత్యేకమైన డిజైన్
Sony Bravia theatre Trio లో ప్రత్యేకమైన ఎడమ, మధ్య, కుడివైపులా ఆడియో ఛానల్స్ అందించే మూడు యూనిట్ల వ్యవస్థ ఉంది. దీనివల్ల టీవీ ముందు నుంచి విస్తృతమైన శబ్దాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. సినిమాలలో డైలాగ్స్.. నేపథ్య సంగీతం.. పోరాట సన్నివేశాల శబ్దాలను మరింత స్పష్టంగా ఆస్వాదించవచ్చు.
360 Spatial sound mapping technology
ఈ హోమ్ థియేటర్లో ప్రధాన ఆకర్షణ 360 spatial sound mapping టెక్నాలజీ. ఇది శబ్దం అన్ని వైపుల నుంచి వస్తున్న అనుభూతి కలిగిస్తుంది. సాధారణంగా హోమ్ థియేటర్లో ప్రత్యేకమైన రియర్ స్పీకర్లు అవసరమవుతాయి. అయితే ఈ టెక్నాలజీ ద్వారా అదనపు స్పీకర్లు లేకుండానే విస్తృతమైన సరౌండ్ సౌండ్ అనుభూతిని పొందవచ్చు.
డాల్బీ అట్మాస్, డిటిఎస్ సపోర్ట్
ఈ సిస్టంలో డాల్బీ అట్మాస్, డిటిఎస్ ఆడియో ఫార్మాట్లకు సపోర్ట్ ఉంటుంది. వీటి ద్వారా సినిమాల్లో శబ్దాలు కేవలం ముందు వైపు నుంచి మాత్రమే కాకుండా.. చుట్టూ.. పై వైపు నుంచి వస్తున్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఐమాక్స్ enhanced సపోర్ట్ కూడా ఉంటుంది. అందువల్ల అనుకూలమైన కంటెంట్ ను మరింత మెరుగైన ఆడియో అనుభవంతో ఆస్వాదించవచ్చు.
అవసరానికి తగ్గట్టుగా..
ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే అవసరాన్ని బట్టి దీనికి అదనపు వైర్లెస్ రియర్ స్పీకర్లు.. సబ్ ఊఫర్లను జత చేసుకోవచ్చు. అంతేకాదు రెండు సబ్బు ఊఫర్లను కూడా అనుసంధానించే సదుపాయం కూడా ఉంది. దీంతో మరింత శక్తివంతమైన బాస్.. సరౌండ్ సౌండ్ అనుభూతిని పొందవచ్చు.
కనెక్టివిటీ
ఈ హోమ్ థియేటర్లో HDMI eARC, Wi-Fi Bluetooth connectivity సదుపాయాలు ఉన్నాయి. హై రిజల్యూషన్ ఆడియో, 360 రియాలిటీ ఆడియో వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.. సోనీ బ్రావియా కనెక్ట్ యాప్ ద్వారా సిస్టం సెట్టింగ్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. అనుకూలమైన బ్రావియా టీవీ లతో కలిపి ఉపయోగించినప్పుడు Acoustic centre Sync వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ధర ఎలా ఉందంటే
భారత మార్కెట్లో సోనీ బ్రావియా థియేటర్ ట్రయో ను 2,39,990 తో విక్రయిస్తున్నారు. ప్రారంభ ఆఫర్ కింద 1,69,990 ధరకు విక్రయిస్తున్నారు. సోనీ రిటైల్ స్టోర్ లు.. సోనీ సెంటర్లు.. ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ దుకాణాలలో చేయవచ్చు. మొత్తంగా చూస్తే సోనీ బ్రావియా థియేటర్ ట్రయో సాధారణ సౌండ్ బార్ కంటే.. ప్రీమియం స్థాయి హోమ్ థియేటర్ అనుభూతిని కోరుకునే వారికోసం రూపొందించిన ఆడియో సిస్టం.