Homeబిజినెస్CNG Cars : పెట్రోల్, డీజిల్‌కు గుడ్‌బై.. సీఎన్‌జీ కార్లదే హవా.. టాప్ 5 బెస్ట్...

CNG Cars : పెట్రోల్, డీజిల్‌కు గుడ్‌బై.. సీఎన్‌జీ కార్లదే హవా.. టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఇవే

CNG Cars : దేశంలో ప్రస్తుతం ప్రజలు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే సీఎన్‌జీ వెహికల్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గత ఐదేళ్లలో సీఎన్‌జీ కార్ల మార్కెట్ వాటా ఏకంగా 6.3శాతం నుంచి 19.5శాతానికి పెరిగింది. అంటే, ఈ సెగ్మెంట్ మూడు రెట్లు వృద్ధి సాధించినది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లు ప్రజలకు ఫస్ట్ ఆప్షన్‌గా మారాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 సీఎన్‌జీ కార్లు ఏవో తెలుసుకుందాం.

1. మారుతి ఎర్టిగా
ఈ జాబితాలో మొదటి స్థానంలో మారుతి ఎర్టిగా ఉంది. ఇది ట్యాక్సీ డ్రైవర్లకు, పెద్ద ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్. మారుతి కంపెనీ ఒక్క సంవత్సరంలోనే 1,29,920 యూనిట్లను విక్రయించింది. ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సీఎన్‌జీ కారుగా నిలిచింది. ఇందులో 1.5L K15C డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, దీనికి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్ వస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది కిలోకు 26.11కిమీ వరకు మైలేజీ ఇస్తుంది. ఇది 7-సీటర్ ఎంపీవీ కావడంతో కుటుంబ అవసరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

2. మారుతి వాగన్‌ఆర్
ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో మారుతి వాగన్‌ఆర్ ఉంది. మారుతి కంపెనీ ఒక సంవత్సరంలో మొత్తం 1,02,128 యూనిట్లను విక్రయించింది. సీఎన్‌జీ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఇది ముందుంది. ఇందులో 1.2L K12N డ్యూయల్‌జెట్ పెట్రోల్ + సీఎన్‌జీ ఇంజిన్ లభిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కిలోకు ఏకంగా 34.05కిమీ మైలేజ్‌ను ఇస్తుంది. తక్కువ ఖర్చులో ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

3. మారుతి డిజైర్
ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న కారు కూడా మారుతి నుంచే. అదే మారుతి డిజైర్. ఏడాదిలొ మొత్తం 89,015 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో మారుతి వాగన్‌ఆర్ లో ఉండే ఇంజినే ఉంటుంది. దీని మైలేజ్ కూడా కిలోకు 34.05కిమీ వరకు వస్తుంది. ఇది ఒక కాంపాక్ట్ సెడాన్, తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్లను అందిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు, ఫ్యామిలీ ట్రిప్పులకు చాలా బాగుంటుంది.

4. టాటా పంచ్
ఈ లిస్ట్‌లో టాటా కంపెనీ నుంచి మొదటి, మొత్తం మీద నాలుగో సీఎన్‌జీ కారు టాటా పంచ్. గతేడాది దీనికి చెందిన 71,113 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది టాటా మైక్రో SUV, కొత్త టెక్నాలజీతో వస్తుంది. ఇందులో 1.2L రెవోట్రాన్ పెట్రోల్ + ట్విన్-సిలిండర్ సీఎన్‌జీ ఇంజిన్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే టాటా కార్లకు ఉండే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పాటు, ఇది కిలోకు 26.99 కిమీ మైలేజ్‌ను ఇస్తుంది. స్టైలిష్ లుక్‌ను కోరుకునే యువతలో ఈ కారు చాలా పాపులర్ అవుతోంది.

5. మారుతి బ్రెజా
మారుతి కంపెనీకి చెందిన సబ్ కాంపాక్ట్ SUV బ్రెజా కూడా బెస్ట్ సెల్లింగ్ సీఎన్‌జీ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. దీని సీఎన్‌జీ మోడల్‌ను 70,928 మంది కొనుగోలు చేశారు. ఇందులో కూడా పవర్ ఫుల్ 1.5L K15C డ్యూయల్‌జెట్ పెట్రోల్ + సీఎన్‌జీ ఇంజిన్ లభిస్తుంది. సీఎన్‌జీపై నడిచినప్పుడు ఈ ఎస్‌యూవీ కిలోకు 25.51కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోనే అత్యధికం. SUV లుక్ కావాలనుకునే వారికి, బడ్జెట్ ఫ్రెండ్లీ సీఎన్‌జీ ఆప్షన్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular