Maruti Dzire : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ సెడాన్‌లలో ఒకటైన మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు స్టైల్‌తో పాటు సేఫ్టీలో కూడా టాప్ ప్లేసులో నిలిచింది. ఫోర్త్ జనరేషన్ మారుతి సుజుకి డిజైర్‌కు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) రెండింటిలోనూ భారత్ NCAP (BNCAP)లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. దీంతో 5 స్టార్ రేటింగ్ సాధించిన కంపెనీ మొట్టమొదటి సెడాన్‌గా డిజైర్ హిస్టరీ క్రియేట్ చేసింది. BNCAP కింద టెస్ట్ చేయబడిన మొదటి కార్లలో మారుతి సుజుకి ఇండియా డిజైర్ కూడా ఒకటి కావడం విశేషం.
సబ్-కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌కు అడల్ట్ ప్రొటెక్షన్‌లో 32కి గాను 29.46 పాయింట్లు లభించాయి. చైల్డ్ ప్రొటెక్షన్‌కు 49కి గాను 41.57 పాయింట్లు వచ్చాయి. ఈ అద్భుతమైన స్కోరు డిజైర్ ఎంత సురక్షితమైన కారో స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా, అంతకుముందు నవంబర్ 2024లోనే ఫోర్త్ జనరేషన్ మారుతి డిజైర్‌కు గ్లోబల్ NCAPలో కూడా 5 స్టార్ రేటింగ్ లభించింది.
Also Read: Maruti Cars: మారుతి కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్..
గ్లోబల్ NCAP టెస్టుల్లో కూడా డిజైర్ తన సత్తా చాటుకుంది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16.00కి గాను 14.17 పాయింట్లు, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16.00కి గాను 15.29 పాయింట్లు సాధించింది. కాంపాక్ట్ సెడాన్‌కు గరిష్టంగా 24.00కి గాను 23.57 డైనమిక్ స్కోర్ లభించింది. ఇంకా, చైల్డ్ రెస్ట్రెంట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌లో 12.00కి గాను 12.00 పర్ఫెక్ట్ స్కోరు సాధించడం విశేషం. సేఫ్టీ అసిస్ట్ ఫీచర్లను చూపించే వెహికల్ అసెస్‌మెంట్ స్కోరులో కూడా డిజైర్ 13.00కి గాను 6.00 పాయింట్లు పొందింది.
సేఫ్టీ విషయంలో టెస్ట్ చేయబడిన డిజైర్ మోడల్‌లో ముందు భాగంలో ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్ , లోడ్ లిమిటర్లు అమర్చబడి ఉన్నాయి. దీనికి అదనంగా మెరుగైన సైడ్ ఇంపాక్ట్ సేఫ్టీ కోసం మోకాలి ఎయిర్‌బ్యాగ్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, థోరాక్స్, హెడ్ ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సైడ్ చెస్ట్ ఎయిర్‌బ్యాగ్‌లు, పెల్విస్ ఎయిర్‌బ్యాగ్‌లను కూడా స్పెషల్ గా చెక్ చేశారు. పిల్లల సేఫ్టీ కోసం, ISOFIX యాంకర్లు, ఇంటిగ్రేటెడ్ CRS (చైల్డ్ రెస్ట్రెంట్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్ వంటి సేఫ్టీ ఫీచర్లతో డిజైర్‌ను అందించారు. మారుతి సుజుకి డిజైర్ తన సేఫ్టీ స్థాయిని గతంలో కంటే గణనీయంగా మెరుగుపరుచుకుంది.
Also Read: Maruti : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? 5 లక్షల్లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే
ఈ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ డిజైర్ పట్ల వినియోగదారుల నమ్మకాన్ని మరింత పెంచుతుంది. మార్కెట్‌లో ఈ కారు ధర రూ.6.84 లక్షల నుండి రూ.10.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.79 కి.మీ. నుంచి 25.71 కి.మీ మధ్య ఇస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్ అయితే కిలోకు 33.73 కి.మీల మైలేజ్‌ను అందిస్తుంది. స్టైల్, సేఫ్టీ, మైలేజ్, మారుతి బ్రాండ్ విశ్వసనీయత.. ఈ అన్నిటి కలయికతో కొత్త డిజైర్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.