Safety Car: కారు కొనాలనుకునుకోవడం మంచిదే. కానీ తక్కువ బడ్జెట్ లో కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ అంతకంటే ఎక్కువ రక్షణ ఉండే కార్లు కావాలని కోరుకునేవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో Safety కి ప్రిఫరెన్స్ ఇచ్చి కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఇండియన్ ఆటో మోబైల్ మార్కెట్లో ఎన్నో కార్లు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే ఎక్కువ రక్షణగా ఉంటాయి. అందుకే ఆ కార్లకు డిమాండ్ ఉంటుంది. కార్లన్నంటిలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఆ కార్లు ఏవో తెలుసుకుందాం..
టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లు ఎంతో మంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఈ కంపెనీ నుంచి ‘హారియర్’ మోడల్ 5 స్టార్ రేటింగ్ పొందింది. SUV అడల్ట్ సేప్టీలో 34 పాయింట్లకు 33.05 పాయింట్లు సొంతం చేసుకుంది. పిల్లల సేప్టీలో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోరు చేసింది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. టాటాకు చెందిన సపారీ సైతం సురక్షితమైన కారుగా పేరు తెచ్చుకుంది. ఇది NCAP టెస్ట్ లో 33.05 పాయింట్లు, చైల్డ్ సేప్టీలో 45 పాయింట్లు దక్కించుకుంది.
వోక్స్ వ్యాగన్ కు చెందిన టైగస్ అత్యుత్తమ సేప్టీ కార్లలో ఒకటిగా నిలిచింది. ఇది పెద్దవారి రక్షనలో 34 పాయింట్లకు 29.64, చైల్డ్ సేప్టీలో 42 పాయింట్లు సొంతం చేసుకుంది. దీంతో ఇది 5 స్టార్ రేటింగ్ ను పొందిన కారుగా నిలిచింది. స్కోడాకు చెందిన కుషాక్ సేప్టీలో 34 పాయింట్లకు 29.64, పిల్లల సేప్టీలో 49 పాయింట్లకు 42 పాయింట్లు సొంతం చేసుకుంది. భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఈ కారు 5 స్టార్ రేటింగ్ ను సొంతం చేసుకుంది.