Homeబిజినెస్Redmi K90 Ultra: ఈ ఫోన్ డిస్ ప్లే చూస్తే మైండ్ బ్లక్ అవుద్ది.. చూస్తే...

Redmi K90 Ultra: ఈ ఫోన్ డిస్ ప్లే చూస్తే మైండ్ బ్లక్ అవుద్ది.. చూస్తే కొనకుండా ఉండలేరు..

Redmi K90 Ultra: ఇప్పుడున్న వాతావరణంలో మొబైల్ తోనే ఎక్కువగా కాలక్షేపం చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. గేమింగ్ తో పాటు ఇతర పనుల కారణంగా ఫోన్ ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం డిస్ ప్లే బాగుంటేనే కళ్లకు ఇంపుగా ఉంటుంది. అలాగే కొత్త అనుభూతి కలుగుతుంది. ఇలాంటి సదుపాయాలను కల్పిస్తూ షియోమి (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మి మార్కెట్లోకి ఆకట్టుకునే డిస్ ప్లే తో కూడిన మొబైల్ ను తీసుకువచ్చారు. ఇంతకీ ఇదేం ఫోన్? ఇందులో ఎలాంటి డిస్ ప్లే ఉంది? ఇంకా ఏమేం ఫీచర్లు ఉన్నాయి?

రెడ్‌మికి చెందిన Redmi K90 Ultra మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. అయితే నిన్నా మొన్నటి వరకు చాలా మంది మూవీస్ ను ఎక్కువగా థియేటర్లోనే చూసేవాళ్లు. అయితే ఇప్పుడు మొబైల్ లోనే మంచి డిస్ ప్లేతో సినిమాలను చూస్తే కొత్త అనుభూతిని పొందుతున్నారు. అలాంటి అనుభూతిని అందించేందుకు ఈ ఫోన్ లో 6.83 అంగుళాల OLED డిస్ ప్లే ను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఇది గేమ్స్ ఆడేటప్పుడు ఏమాత్రం లాగ్ లేకుండా 165Hz రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఉండడంతో అవుట్‌డోర్ ఎండలో కూడా స్క్రీన్ చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. అలాగే కంటి రక్షణ కోసం ఐ ప్రొటెక్షన్ మోడ్ 3.0, డాల్బీ విజన్ ను చేర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతల్లో Vortex Airflow Design కూలింగ్ సిస్టమ్ ఒకటి. సాధారణంగా గేమింగ్ ఫోన్లకు విడిగా కూలింగ్ ఫ్యాన్లను వాడుతుంటారు. కానీ Redmi K90 Ultra లో మొబైల్ లోపలే ఫిజికల్ మెకానికల్ కూలింగ్ ఫ్యాన్ ను అమర్చారు. ఇది 6000 వేపర్ ఛాంబర్‌తో కలిసి పనిచేస్తూ, కేవలం 100 సెకన్లలోనే ఫోన్ యొక్క అంతర్గత ఉష్ణోగ్రతను 10 సెంటిగ్రేట్ వరకు తగ్గిస్తుంది.

ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ మొబైల్ లో 8,550mAh సింగిల్ సెల్ బ్యాటరీ ని అందించారు. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అంతేకాదు, గేమ్స్ ఆడేటప్పుడు బ్యాటరీ వేడెక్కకుండా నేరుగా మదర్‌బోర్డ్ నుండి పవర్ తీసుకునే Bypass Charging ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు.

Redmi K90 Ultra ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 8K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు సెల్ఫీల కోసం ముందు వైపు 20MP కెమెరాను ఇచ్చారు. వీటితో పాటు బోస్ ట్యూన్ చేసిన స్పీకర్లు, 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ధూళి, నీటి నుండి అత్యుత్తమ రక్షణ కోసం IP69 రేటింగ్స్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత.

ఈ ఫోన్ చైనా మార్కెట్లో విడుదలయింది. 12GB RAM , 256GB స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ 2,999 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు ₹42,000)తో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper