Homeబిజినెస్Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ తో ఒప్పో కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా లేటెస్ట్ గా కొత్త ఫోన్ ను మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. దీని గురించిన సమాచారం గీక్ బెంచ్ ద్వారా లీకులు కావడంతో చాలా మంది ఈ ఫోన్ పై […]

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ తో ఒప్పో కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా లేటెస్ట్ గా కొత్త ఫోన్ ను మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. దీని గురించిన సమాచారం గీక్ బెంచ్ ద్వారా లీకులు కావడంతో చాలా మంది ఈ ఫోన్ పై ఆసక్తి చూపుతున్నారు. వీటిలో ఉండే కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

ఒప్పో నుంచి Oppo A7 Pro Max అనే మొబైల్ త్వరలో చైనా మార్కెట్లో రిలీజ్ కానుంది. తక్కువ ధరలో మంచి బ్యాటరీ కావాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఈ మొబైల్ లో 6.78 అంగుళాల OLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 1.5 కే రిజల్యూషన్ తో ఉండనుంది. ఇది 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో ఉండడం వల్ల స్మూత్ విజువల్స్ అందిస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 5 జెన్ 5 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం దీనిని ఉపయోగిస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో 12 జీబీ ర్యామ్ తో వేగంగా పనిచేసే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఇందులో బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 10,000mAh భారీ బ్యాటరీని ఉంచారు. ఇది ఒప్పో ఏ సిరీస్ లోనే పెద్ద బ్యాటరీ గా చెప్పుకుంటున్నారు. ఈ బ్యాటరీకి 80 వాట్ సపోర్ట్ ఛార్జర్ పని చేయనుంది. ఇందులో భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ చాలా స్లిమ్ గా ఉంటూ ఆకట్టుకుంటుంది.

ఒప్పో మొబైల్స్ లో కెమెరాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే ఇందులో వెనుకవైపు 50 మెగా పిక్సెల్ తో కూడిన కెమెరాను ఉంచారు. దీనితో పాటు 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో కలిగిన కెమెరా ఉండనుంది. సెల్పీలు, వీడియో కాలింగ్ కోసం ఇందులో 50ఎంపీ కెమెరా పనిచేస్తుంది.ఇది మార్కెట్లోకి వస్తే భారత కరెన్సీ ప్రకారం రూ.29,990 నుంచి ప్రారంభం అవుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper