spot_img
Homeబిజినెస్Motorola latest smartphones: ఈ మొబైల్స్ ను క్యూ కట్టి మరీ కొంటున్నారు.. ఇంతకీ ఇందులో...

Motorola latest smartphones: ఈ మొబైల్స్ ను క్యూ కట్టి మరీ కొంటున్నారు.. ఇంతకీ ఇందులో ఏమున్నాయి? ఇవి ఎవరికీ ఉపయోగం?

Motorola latest smartphones: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వస్తుంటాయి. కానీ ఫోన్ వినియోగదారులు కొన్నిటిని మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కొందరు బడ్జెట్ గురించి ఆలోచిస్తే.. మరికొందరు ఇందులో ఉండే ఫీచర్స్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. ఇంకొందరు బ్యాటరీ సామర్థ్యం బాగుండాలని అనుకుంటారు. అయితే ఇవన్నీ కలగలిపి ఒకే ఫోన్లో ఉండే అవకాశం లేదా? అంటే కచ్చితంగా ఉందంటూ Motorola కంపెనీ నిరూపిస్తుంది అని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మోటరోలా కంపెనీ నుంచి వచ్చే మొబైల్స్ లో అద్భుతమైన ఫీచర్స్ తో పాటు, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం అద్భుతంగా ఉందంటూ తెలుపుతున్నారు. అందుకే ఈ మొబైల్స్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మొబైల్ కంపెనీ భారత్ లో ఎలాంటి అభివృద్ధి సాధిస్తుందో ఇప్పుడు చూద్దాం..

మోటరోలా కంపెనీ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ షేర్ ధర 2025 లో ఆరు శాతానికి చేరి 135% గ్రోత్ తో రికార్డ్ సాధించింది. 2023 చివరిలో 2.7 నుంచి 2025లో ఆరు శాతానికి పెరగడం విశేషం. 2026 చివరి సంవత్సరం వరకు 10 శాతం మార్కెట్ షేర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా టాప్ 3 బ్రాండ్స్ లో మోటోరోలా మొబైల్స్ ఉండాలని టార్గెట్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రీమియం మోడల్స్ విభాగంలో ఈ కంపెనీ 60 శాతం రెవెన్యూ పొందుతుంది. అయితే మోటరోలా కంపెనీకి సామ్సంగ్, వివో, షావోమి కంపెనీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇవి కూడా మోటరోలా ఫోన్ తరహా లోనే ఉండడంతో చాలామంది వాటిపై ఆసక్తి చూపుతున్నారు. కానీ మోటరోలా మొబైల్స్ లో ఉండే కెమెరా, బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో వీటిపైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మోటోరోలా కంపెనీకి చెందిన అన్ని మొబైల్స్ లో షాప్ డ్రాగన్ మీడియాటిక్ డైమెన్సిటీ చిప్ సెట్ అమరుస్తారు. అలాగే ఇందులో సామర్థ్యాన్ని బట్టి ర్యామ్, స్టోరేజ్ ని అందిస్తారు. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసేవారు ఈ ఫోన్స్ ను ఎక్కువగా పెంచుకుంటారు. ఇందులో భాగంగా మోటరోలా G67 మొబైల్ వంటి వాటిని రోజువారి వినియోగదారులతో పాటు యూత్ కూడా ఎక్కువగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ లో 5000 mAh నుంచి 7000 mAh వరకు ఫ్యాక్టరీ సామర్థ్యం ఉంటాయి. దీంతో గంటలపాటు మొబైల్ వినియోగించే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. ఈ బ్యాటరీ లు గరిష్టంగా 68 W ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తాయి. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ కావడానికి ఈ చార్జర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొబైల్స్ లో కెమెరా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దాదాపు అన్ని రకాల మొబైల్స్ లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇవి AI ఫీచర్లతో ఉండటంవల్ల చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు. ఇక ధర విషయంలోనూ ఈ కంపెనీకి చెందినవి అందుబాటు. రూ.12,000 నుంచి రూ.35,000 వరకు ఉండడంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ మొబైల్ పై ఆసక్తి చూపుతుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular