Homeబిజినెస్Motorola Edge 70 Price: మోటోరోలా ఎడ్జ్‌ 70 : ధర పెరిగింది.. మరి ఫీచర్స్‌...

Motorola Edge 70 Price: మోటోరోలా ఎడ్జ్‌ 70 : ధర పెరిగింది.. మరి ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?

Motorola Edge 70 Price: అంతర్జాతీయ స్మార్ట్‌ ఫోన్‌ మొబైల్‌ తయారీ సంస్థ మోటరోలా. మనదేశంలో మార్కెట్‌ తక్కువే. కానీ అతర్జాతీయంగా మంచి షేర్‌ ఉంది. మోటరోలా భారత్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునే స్మార్ట్‌ ఫోన్లు లాంచ్‌ చేస్తోంది. తాజాగా లాంచ్‌ చేసిన మోటరోలా ఎడ్జ్‌ 70 (8జీబీ+256జీబీ) ధరను రూ.3 వేలు పెంచింది. రూ.29,999 నుంచి రూ.32,999కి చేరింది. అధికారిక సైట్లు, ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో కొత్త ట్యాగ్‌ కనిపిస్తోంది. ఏ అప్‌డేట్స్‌ లేకుండా […]

Motorola Edge 70 Price: అంతర్జాతీయ స్మార్ట్‌ ఫోన్‌ మొబైల్‌ తయారీ సంస్థ మోటరోలా. మనదేశంలో మార్కెట్‌ తక్కువే. కానీ అతర్జాతీయంగా మంచి షేర్‌ ఉంది. మోటరోలా భారత్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునే స్మార్ట్‌ ఫోన్లు లాంచ్‌ చేస్తోంది. తాజాగా లాంచ్‌ చేసిన మోటరోలా ఎడ్జ్‌ 70 (8జీబీ+256జీబీ) ధరను రూ.3 వేలు పెంచింది. రూ.29,999 నుంచి రూ.32,999కి చేరింది. అధికారిక సైట్లు, ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో కొత్త ట్యాగ్‌ కనిపిస్తోంది. ఏ అప్‌డేట్స్‌ లేకుండా ఈ మార్పు కస్టమర్ల బడ్జెట్‌ను పరీక్షిస్తోంది. బ్యాంక్‌ డిస్కౌంట్లు ఇంకా ఆఫర్‌లో ఉన్నా, ఎఫెక్టివ్‌ కాస్ట్‌ పెరిగింది.

Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!

అల్ట్రా–థిన్‌ లగ్జరీ డిజైన్‌
5.99 ఎంఎం మందంతో ఇండస్ట్రీ థిన్నెస్ట్‌లలో ఒకటైన ఈ ఫోన్‌ ప్రీమియం టచ్‌ ఇస్తుంది. గొరిల్లా గ్లాస్‌ 7జీ, IP68/IP69 రెసిస్టెన్స్, MIL-STD&810H సర్టిఫికేషన్‌ రోజువారీ డ్యూరబిలిటీని హామీ ఇస్తాయి. కాంటెంపరరీ ఫినిష్‌లు గ్రిప్‌ను మెరుగుపరచి, స్టైలిష్‌ లుక్‌ ఇస్తాయి. హ్యాండ్‌హోల్డ్‌ కంఫర్ట్‌ మిడ్‌–రేంజ్‌లో అసలైన ఫ్లాగ్‌షిప్‌ ఫీల్‌.

వివిడ్‌ pOLED విజువల్స్‌
6.7–ఇంచ్‌ 1.5K (2712×1220) pOLED స్క్రీన్‌ 120Hz రేట్‌తో ఫ్లూయిడ్‌ స్క్రోలింగ్, రిచ్‌ కలర్‌ రేంజ్‌ అందిస్తుంది. హై బ్రైట్‌నెస్‌ ఔట్‌డోర్‌ వ్యూయింగ్‌ను ఈజ్‌ చేస్తుంది, గేమింగ్‌/స్ట్రీమింగ్‌లో ఇమ్మర్సివ్‌ ఎక్స్‌పీరియన్స్‌. HDR సపోర్ట్‌ కాంట్రాస్ట్‌ను ఎలివేట్‌ చేస్తుంది. మీడియా కన్సూ్యమర్స్‌కు బెస్ట్‌ సెగ్మెంట్‌ పెర్ఫార్మెన్స్‌.

స్నాప్‌డ్రాగన్‌ పవర్‌ బ్యాలెన్స్‌
స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 చిప్‌ డైలీ టాస్క్స్, మల్టీటాస్కింగ్‌ను సిల్క్‌–స్మూత్‌గా హ్యాండిల్‌ చేస్తుంది. గేమింగ్‌లో స్థిర ఫ్రేమ్‌రేట్స్, థెర్మల్‌ మేనేజ్‌మెంట్‌ బాగుంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ లాంగ్‌ సెషన్స్‌కు సపోర్ట్‌. మిడ్‌–రేంజ్‌లో ప్రీమియం స్పీడ్‌ వాల్యూ ఫర్‌ మనీ ఇస్తుంది.

ట్రిపల్‌ 50 ఎంపీ కెమెరా సెటప్‌
డ్యూయల్‌ 50 ఎంపీ రియర్‌ (మెయిన్‌ + అల్ట్రా–వైడ్‌) షార్ప్‌ డీటెయిల్స్, వైడ్‌ షాట్స్‌ క్యాప్చర్‌ చేస్తాయి. 50 ఎంపీ ఫ్రంట్‌ సెల్ఫీలు, 4k వీడియోస్‌ను క్రిస్ప్‌గా రికార్డ్‌ చేస్తుంది. లో–లైట్‌ పెర్ఫార్మెన్స్, అఐ ఎన్‌హాన్స్‌మెంట్స్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు ఆకర్షణీయం. వర్సటైల్‌ ఫోటోగ్రఫీ హైలైట్‌.

బ్యాటరీ వివరాలు..
5000 ఎంఏహెచ్‌సెల్‌ ఫుల్‌–డే యూజ్‌కు సరిపోతుంది, 68w టర్బోపవర్‌ ఫాస్ట్‌ రీఫిల్‌ (ఫుల్‌ చార్‌ 30ని.) ఇస్తుంది. 15w వైర్‌లెస్‌ ఆప్షన్‌ అదనపు కన్వీనియన్స్‌. ఆప్టిమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌ డ్రైన్‌ను కంట్రోల్‌ చేస్తుంది. మొబైలిటీకి పర్ఫెక్ట్‌ బ్యాలెన్స్‌.

ధర పెంపు సేల్స్‌ను తగ్గిస్తుంది. ముఖ్యంగా కాంపిటీటర్స్‌ (రెడ్మి, రియల్‌మీ) డీల్స్‌ ఉన్నప్పుడు. స్లిమ్‌నెస్, బిల్డ్‌ క్వాలిటీ యూనిక్‌ సెల్లింగ్‌ పాయింట్స్‌ ఫ్యాన్స్‌ ఇవి కొనసాగుతారు. ఎక్సే్చంజ్‌/ఆఫర్స్‌తో ఎఫెక్టివ్‌ ప్రైస్‌ చెక్‌ చేసి కొనాలి. మిడ్‌–ప్రీమియం సెగ్మెంట్‌లో డిజైన్‌ ఫోకస్‌తో మోటోరోలా ఎడ్జ్‌ పట్టుకుంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper