Homeఎంటర్టైన్మెంట్Anchor Rashmi Comments On YCP Fans Trolls: వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్స్ పై యాంకర్...

Anchor Rashmi Comments On YCP Fans Trolls: వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్స్ పై యాంకర్ రష్మీ హాట్ కామెంట్స్.. ఈ రేంజ్ అసలు ఊహించలేదు..

Anchor Rashmi Comments On YCP Fans Trolls: ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ నాయకులు ఏ రేంజ్ లో నెగెటివిటీ ని ఎదురుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ ‘మావిగాన్’ అంటూ కామెంట్స్ చేసి జెన్ జీ యూత్ లో ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాడు. ఇప్పటికీ ఆ అంశం పై ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఎలా అయినా సరే ప్రభుత్వం పై నెగెటివ్ […]

Anchor Rashmi Comments On YCP Fans Trolls: ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ నాయకులు ఏ రేంజ్ లో నెగెటివిటీ ని ఎదురుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ ‘మావిగాన్’ అంటూ కామెంట్స్ చేసి జెన్ జీ యూత్ లో ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాడు. ఇప్పటికీ ఆ అంశం పై ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఎలా అయినా సరే ప్రభుత్వం పై నెగెటివ్ కామెంట్స్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఏ చిన్న సమస్య వచ్చినా ఒక రేంజ్లో రెచ్చిపోతూ గ్రౌండ్ లెవెల్ లో నిరసన కార్యక్రమాలు చేయడం వాళ్లకు సర్వసాధారణం అయిపోయింది. అందులో భాగంగా నాలుగు రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన తాత్కాలిక పెట్రోల్ , డీజల్ కొరతపై పలు ప్రాంతాల్లో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా తిరుపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినవ్ రెడ్డి ఒక ఆటో ని ఎద్దు బండిపై పెట్టి , అందులో మనుషులను కూర్చోబెట్టి , రోడ్డు మీద చేసిన నిరసన ప్రదర్శనకు సంబంధించిన వీడియో పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్స్ పడ్డాయి. సాధారణంగానే జంతు ప్రేమికురాలు అయిన యాంకర్ రష్మీ ఈ వీడియో పై స్పందిస్తూ ‘ఆ ఎద్దు పడుతున్న బాధ ని పైన దర్జాగా ఆటో కూర్చున్న మనుషులు , ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు భవిష్యత్తులో అనుభవిస్తారు’ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయిన వైసీపీ నేత ప్రదీప్ చింత కూడా రష్మీ కామెంట్స్ పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.

ఆయన కామెంట్స్ పై స్పందించిన రష్మీ మాట్లాడుతూ ‘నేను ఏ పార్టీ కి చెందిన మనిషిని కాదు , ఏ కులాన్ని మతాన్ని ద్వేషించడం నా ఉద్దేశ్యం కాదు. నేను ఒక జంతు ప్రేమికురాల్ని. ఎన్ని అవమానాలు ఎదురైనా, నోరు లేని జీవాలు మనుషుల చేత హింసకు గురైనప్పుడు నా గళం వినిపిస్తూనే ఉంటాను , నన్ను ఎవ్వరూ ఆపలేరు. జంతుబలి , ఏనుగుల హింస వంటి వాటిపై నేను నా గళం వినిపించినప్పుడల్లా నన్ను కొంతమంది దూషిస్తున్నారు. సోషల్ మీడియా లో కూర్చొని ఎవరో ఒకరిని విమర్శించడం కంటే మూగ జీవాల సంక్షేమానికి ఎవరు తోడ్పడినా వారికి నా మద్దత్తు ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది రష్మీ. ఆమెలోని ఈ ధైర్యాన్ని చూసి , సోషల్ మీడియా లో నెటిజెన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper