Homeబిజినెస్Air Cooler Tips: ఈ సింపుల్ ట్రిక్స్ తో కూలర్ గాలిని ఏసీ లాగా మార్చుకోండి..

Air Cooler Tips: ఈ సింపుల్ ట్రిక్స్ తో కూలర్ గాలిని ఏసీ లాగా మార్చుకోండి..

Air Cooler Tips: వేసవికాలం రాగానే చల్లదనం కోసం చాలామంది కూలర్లు ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కూలర్లు పెట్టినా కూడా చల్లదనం రాదని బాధపడుతూ ఉంటారు. అయితే అవగాహన లేకపోవడం వల్ల.. కూలర్లు చిన్న మార్పులు చేసుకోకపోవడం వల్ల.. వీటిని సరైన దిశలో ఉంచకపోవడం వల్ల వీటి నుంచి వచ్చే గాలి చల్లదనం అనిపించదు. అందువల్ల కూలర్లను ఏర్పాటు చేసుకునే సమయంలో కొన్ని విషయాలను ముందే తెలుసుకోవాలి. వాటి ప్రకారంగా చేస్తే ఏసీ కూడా అందించని […]

Air Cooler Tips: వేసవికాలం రాగానే చల్లదనం కోసం చాలామంది కూలర్లు ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కూలర్లు పెట్టినా కూడా చల్లదనం రాదని బాధపడుతూ ఉంటారు. అయితే అవగాహన లేకపోవడం వల్ల.. కూలర్లు చిన్న మార్పులు చేసుకోకపోవడం వల్ల.. వీటిని సరైన దిశలో ఉంచకపోవడం వల్ల వీటి నుంచి వచ్చే గాలి చల్లదనం అనిపించదు. అందువల్ల కూలర్లను ఏర్పాటు చేసుకునే సమయంలో కొన్ని విషయాలను ముందే తెలుసుకోవాలి. వాటి ప్రకారంగా చేస్తే ఏసీ కూడా అందించని చల్లదనాన్ని కూలర్లు ఇస్తాయి. మరి కూలర్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కూలర్లను ఇంట్లో ఏర్పాటు చేసుకునే సమయంలో ఇష్టం వచ్చినట్లు ఉంచుతారు. కానీ దీని నుంచి స్వచ్ఛమైన గాలి రావడానికి సరైన దిశలో ఉంచాలి. కూలర్లకు వెనుక భాగం నుంచి గాలి వస్తేనే ముందటి భాగంలో స్వచ్ఛమైన గాలి అందిస్తుంది. అంటే కిటికీ దగ్గర లేదా కూలర్లకు బ్యాక్ సైడ్ ఓపెన్ చేసిన డోర్ ఉంచాలి. అలాంటి ప్రదేశంలో పెడితే స్వచ్ఛమైన గాలి అందుతుంది. అంతేకాకుండా దీని నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది.

చాలామంది కూలర్ల నుంచి వేడిగాలి వస్తుందని బాధపడుతూ ఉంటారు. అందుకు ఇందులో ఉండే నీరు కూడా కారణమే అని అనుకోవాలి. కూలర్లలో నీరు చల్లగా ఉంటే దీని నుంచి వచ్చే గాలి కూడా కూల్ గా ఉంటుంది. అంటే ఇందులో సాధారణ నీరు పోయకుండా చల్లగా ఉండే నీటిని పోయాలి. లేదా వీటిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల కూడా నీరు చల్లగా మారి స్వచ్ఛమైన చల్లదనాన్ని ఇచ్చే గాలి అందుతుంది. అంతేకాకుండా ఉదయం పోసిన నీరు సాయంత్రం వరకు వేడెక్కి అవకాశం ఉంటుంది. అందువల్ల సాయంత్రం కూడా కొత్త నీటిని చేర్చడం వల్ల రాత్రి సమయంలో చల్లటి గాలి అందుతుంది.

కూలర్లు చల్లగా రావడానికి ప్రధాన కారణం వీటిలో ఉండే ప్యాడ్స్ లో నీరు నిల్వ ఉండడమే. అయితే ఈ ప్యాడ్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం ఇందులో ఉండే ప్యాడ్స్ ను మార్చి వేయాలి. ఈ ప్యాడ్స్ మార్చడం వల్ల చల్లటి గాలిని పొందవచ్చు. ఎందుకంటే ఇందులో దుమ్ము, ధూళి పేరుకుపోయి గాలి రావడానికి అడ్డుకుంటాయి.

కూలర్ నుంచి వచ్చే గాలి చల్లగా ఉండడానికి గదిలో ఉండే వాతావరణం కూడా ముఖ్యమే. అంటే ఒక గదిలో వేడిని పెంచే గాడ్జెట్స్ లేదా ఇతర వస్తువులు ఉండటం వల్ల కూలర్ నుంచి వచ్చే గాలి చల్లగా అనిపించదు. అందువల్ల అలాంటి వస్తువులు ఏమైనా ఉంటే ఆఫ్ చేయాలి . లేదా మరో గదికి మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కూలర్ నుంచి వచ్చే గాలి చల్లగా అనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper