Homeబిజినెస్Jio Electric Cycle: JIO నుంచి ఎలక్ట్రిక్ సైకిల్.. ధర చూస్తే షాక్ అవుతారు..

Jio Electric Cycle: JIO నుంచి ఎలక్ట్రిక్ సైకిల్.. ధర చూస్తే షాక్ అవుతారు..

Jio Electric Cycle: Reliance కంపెనీకి చెందిన jio గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో ఉంచుకొని దీని ద్వారా తక్కువ ధరకే సిమ్ అందించారు. ఆ తర్వాత ఫైబర్ నెట్ వంటివి కూడా బడ్జెట్లోనే ఇచ్చారు. ఇప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం కొత్తగా ఎలక్ట్రిక్ సైకిల్ ని తీసుకువచ్చారు. రోజువారి ప్రయాణికులతో పాటు కళాశాలకు వెళ్లే వారికి ఈ సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తిగా విద్యుత్ వేరియంట్ లో ఉన్న ఈ సైకిల్ అత్యధిక మైలేజ్ ఇవ్వడంతో పాటు ఎలాంటి శ్రమ లేకుండా గమ్యానికి చేరవచ్చు. అలాగే సిటీ రోడ్లపై వెళ్తే ఆకర్షినియంగా కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఈ సైకిల్ ని ఎంత ధరకు కొనుగోలు చేయవచ్చు? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

మార్కెట్లోకి వచ్చిన Jio Electric Cycle డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. దీనికి LED హెడ్ లాంప్స్ కొత్తదనాన్ని తీసుకువచ్చింది. ఉదయం, రాత్రి సమయంలో కూడా దీనిపై వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ ప్రాంతంలో వెళ్లినా కూడా సులభంగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది. దీని నిర్మాణం చాలా తేలికగా ఉండడంతో తక్కువ దూరం వెళ్లే వారికి ఇది అనుకూలంగా ప్రయాణం చేయగలదు. మరమ్మతులకు కూడా అవకాశం ఉండడంతో రోజువారి వినియోగదారులు దీనిని కొనుగోలు చేయవచ్చు. అలాగే దీనిపై నిటారుగా కూర్చుని ప్రయాణం చేయడం వల్ల ఎలాంటి అలసట అనిపించదు. హ్యాండిల్ బార్ రిచ్ లెవెల్ లో కనిపిస్తుంది. బ్యాటరీ శాతం, కిలోమీటర్ల వేగం చూపించేందుకు కాంట్రాక్టు డిజిటల్ డిస్ప్లేను అమర్చారు. అలాగే స్టాప్ అండ్ గో ట్రాఫిక్ లో కూడా రైడర్లు ఎలాంటి ఇబ్బందులు.

ఈ సైకిల్ లో ఉండే బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేయడం వల్ల 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. సాధారణ ప్రయాణాలు చేసేవారు ఆరు నుంచి 8 రోజులపాటు చార్జింగ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే రైడర్ బరువు, వేగం, రోడ్డు నాణ్యతను బట్టి మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ నగరాల్లో ఉండే వారికి మాత్రం ఇది సౌలభ్యంగానే ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉపయోగించేవారికి బ్యాటరీ సపోర్ట్ గా పనిచేస్తుంది. ఇది మార్కెట్లో ప్రస్తుతం రూ.25,000 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఒకేసారి ఈ మొత్తాన్ని చెల్లించలేని వారు రూ.5,000 డౌన్ పేమెంట్ తో చెల్లించవచ్చు. కళాశాల విద్యార్థులు, రోజువారి అవసరాల కోసం మార్కెట్, తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular