Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీAI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు. ఊహించని తెగుళ్లు దాడి చేస్తున్నాయి. కంటికి కనిపించని వ్యాధులు సోకుతున్నాయి. పంట సాగు చేసింది మొదలు.. దిగుబడి చేతికి వచ్చేవరకు.. ఇలా ఏ దశలో కూడా రైతుకు ఒక నమ్మకం అంటూ లేకుండా పోయింది. ఆకాశం వైపు ఆశగా చూసి.. భూదేవి వైపు […]

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు. ఊహించని తెగుళ్లు దాడి చేస్తున్నాయి. కంటికి కనిపించని వ్యాధులు సోకుతున్నాయి. పంట సాగు చేసింది మొదలు.. దిగుబడి చేతికి వచ్చేవరకు.. ఇలా ఏ దశలో కూడా రైతుకు ఒక నమ్మకం అంటూ లేకుండా పోయింది. ఆకాశం వైపు ఆశగా చూసి.. భూదేవి వైపు నమ్మకం పెట్టుకొని రైతులు పంటలు సాగుచేస్తున్నారు. పంట ఉత్పత్తి మెరుగ్గా వస్తే 4 పైసలు వెనకేసుకుంటున్నారు. ఒకవేళ పాట నష్టపోతే అప్పులు చేసి.. మరింత దిగజారి పోతున్నారు.

పంటలపై సోకిన రోగాలను నయం చేయడానికి ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. మందులు శక్తివంతంగా ఉన్నప్పటికీ.. పంటలకు సోకే రోగాలు.. చీడపీడలు మరింత శక్తివంతంగా ఉంటున్నాయి. అందువల్లే వాటిని నయం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. దీనికి తోడు వాతావరణం లో ఉన్న మార్పుల వల్ల చీడపీడలు మరింత శక్తివంతంగా మారుతున్నాయి. అందువల్లే మొండిగా రూపాంతరం చెందుతున్నాయి. అయితే ఇకపై క్రిమిసంహారకాలు వాడాల్సిన అవసరం లేదు. పంటల ఉత్పత్తిని మెరుగుపరచడానికి కెమెరాలను వాడాలి. ఏంటి ఈ ప్రయోగం.. ఏం చేస్తున్నారు దీంతో అంటే..

అంతరిక్ష ప్రయోగాలలో శాటిలైట్ కెమెరాలు వాడటమనేది సర్వసాధారణం. ఈ ఉపగ్రహ కెమెరాలు కూడా అత్యంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి 0.1 కెల్విన్ వ్యత్యాసాన్ని కూడా గుర్తిస్తాయి.. ఈ కెమెరాల ద్వారా పొలాల్లో మొక్కలకు సోకిన తెగుళ్లను గుర్తించవచ్చు. చివరికి వాటి స్పెక్ట్రల్ సిగ్నేచర్ ను చూడవచ్చు. ఒకవేళ మొక్కలు ఎండిపోతుంటే.. ఆ సమయాన్ని అంచనా వేసి.. ఎంత నీరు అవసరం పడుతుందో.. ఎంత మేరకు అందించాలో తెలుసుకోవచ్చు. ఈ మొక్కలకు ఎరువులు కూడా ఏ స్థాయిలో వేయాలో అంచనా వేయవచ్చు. భూమిలో ఉన్న మృత్తికలను.. అందులో లోపాలను గుర్తించి.. దానికి అనుకూలంగా రకరకాల పంటలను సాగు చేసుకోవచ్చు.

ఈ కెమెరాలతో ప్రయోగించడం కంటే ముందు భూమి వివరాలు పరీక్షించాలి. ఆ వివరాల ఆధారంగానే పంటలు సాగు చేసుకోవచ్చు. ఎటువంటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ అవసరం లేకుండానే ఉత్పత్తి సాధించవచ్చు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇదే విషయాన్ని ఇటీవల స్కై రూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్ కుమార్ వెల్లడించారు. వచ్చే రోజుల్లో మనుషులకు పూర్తి సేంద్రియ విధానంలో పంట ఉత్పత్తులు అందించడం సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు. తద్వారా భూమి కాలుష్యం తగ్గుతుందని.. రోగాలు లేని సమాజం ఏర్పడుతుందని ఆయన వివరించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper