Homeబిజినెస్November 2026 Bikes: నవంబర్ లో రిలీజ్ అయ్యే బైక్ లు ఇవే.. ధర.. ఫీచర్లు.....

November 2026 Bikes: నవంబర్ లో రిలీజ్ అయ్యే బైక్ లు ఇవే.. ధర.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

November 2026 Bikes: అద్దంలా మెరిసిపోయే తారు రోడ్డు… దానిమీద వేగంగా దూసుకుపోయే బైక్.. పైగా రాజసం.. ఇటువంటి సౌకర్యాలు ఉన్న ద్విచక్ర వాహనాలను యూత్ అమితంగా ఇష్టపడుతుంటారు. యూత్ ఇష్టాలు రోజురోజుకు మారిపోతుంటాయి. వారి ఇష్టాలకు తగ్గట్టుగానే కంపెనీలు కూడా ద్విచక్ర వాహనాలను తయారుచేస్తాయి. ఈ ఏడాది ఇప్పటికే చాలా వరకు ద్విచక్ర వాహనాలు మార్కెట్ లో సందడి చేశాయి. ఈ నేపథ్యంలో ఈ నవంబర్ నెలలో మార్కెట్లోకి వచ్చే ద్విచక్ర వాహనాలు.. వాటి ధర.. […]

November 2026 Bikes: అద్దంలా మెరిసిపోయే తారు రోడ్డు… దానిమీద వేగంగా దూసుకుపోయే బైక్.. పైగా రాజసం.. ఇటువంటి సౌకర్యాలు ఉన్న ద్విచక్ర వాహనాలను యూత్ అమితంగా ఇష్టపడుతుంటారు. యూత్ ఇష్టాలు రోజురోజుకు మారిపోతుంటాయి. వారి ఇష్టాలకు తగ్గట్టుగానే కంపెనీలు కూడా ద్విచక్ర వాహనాలను తయారుచేస్తాయి. ఈ ఏడాది ఇప్పటికే చాలా వరకు ద్విచక్ర వాహనాలు మార్కెట్ లో సందడి చేశాయి. ఈ నేపథ్యంలో ఈ నవంబర్ నెలలో మార్కెట్లోకి వచ్చే ద్విచక్ర వాహనాలు.. వాటి ధర.. ఫీచర్లు ఒకసారి తెలుసుకుందాం.

రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 750

దీని అంచనా ధర నాలుగు నుంచి ఐదు లక్షలు.750 సిసి విభాగంలో అడ్వెంచర్ టూర్ దీని సొంతం. నవంబర్ 3న ఈఐ సీఎంఏ 2026 లో దీనిని ఆవిష్కరించారు. మనదేశంలో మార్కెట్లో విడుదల తేదీ మీద ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు.

Triumph Trident 800

దీని అంచనా ధర 10.95 లక్షలు. 800 సిసి ప్రీమియం నేకేడ్ స్పోర్ట్స్ బైక్ ఇది. నవంబర్లో విడుదలయ్య అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

BMW F 450 R

దీని అంచనా ధర 4.5 నుంచి 5 లక్షలు. 450 సిసి. ప్రీమియం నేకెడ్ బైక్ ఇది. నవంబర్లో విడుదలయ్య అవకాశం ఉంది.

Hero Karizma xmr 250

దీని అంచనా ధర రెండు నుంచి 2.4 లక్షలు. 250 సిసి స్పోర్ట్స్ బైక్ భాగంలో వస్తున్న మోడల్ ఇది. 2026 చివరి నాటికి విడుదలకు అవకాశం ఉంది. అయితే నవంబర్లో తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

Honda Rebel 500

దీని అంచనా ధర 5.4 నుంచి 5.5 లక్షలు. 471 సిసి క్రూజర్ మోటార్ సైకిల్ ఇది.. ఇది క్లచ్ వేరియంట్ లో కూడా లభించే అవకాశం ఉంది. నవంబర్లో లేదా డిసెంబర్ లో విడుదలకు అవకాశం ఉంది.

Nortan atlas

దీని అంచనా ధర ఐదు నుంచి ఏడు లక్షలు. 585 సిసి అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఇది. నవంబర్ చివరివరంలో విడుదలకు అవకాశం ఉంది.

ఇవే కాకుండా Ducati desert x V2, trimph Street 798, Harley Davidson x350t, BMW r1300 r, Royal Enfield continental GT 750 వంటి మోడల్స్ కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper