Hero : ఒకప్పుడు ఆ రెండు కంపెనీలు కలిసి పనిచేశాయి. కానీ ఆ తర్వాత విడిపోయాయి. విడిపోయిన తర్వాత కూడా దేశంలో నెం.1 టూ-వీలర్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్‌కు ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. అది మరే కంపెనీతో కాదు. దాదాపు 15 ఏళ్ల క్రితం హీరోతో విడిపోయిన కంపెనీ నుంచే ఈ సవాల్ వస్తోంది. ఏప్రిల్ నెల హోల్‌సేల్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. ఈ వేరుపడిన కంపెనీ హీరో మోటోకార్ప్‌ను కేవలం వెయ్యి లేదా రెండు వేల యూనిట్ల తేడాతో కాదు ఏకంగా 1.75 లక్షల యూనిట్ల భారీ తేడాతో సవాల్ విసురుతోంది.
Also Read : రూ. 11 లక్షల లోపు బెస్ట్ సెడాన్ కార్లు ఇవే
జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) 2010కి ముందు ఈ కంపెనీ హీరో మోటోకార్ప్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ‘హీరో హోండా’ పేరుతో పనిచేసింది. ఆ తర్వాత రెండు కంపెనీలు విడిపోయి హీరో మోటోకార్ప్ , హెచ్‌ఎంఎస్‌ఐగా మారాయి. ఏప్రిల్ నెలలో హోండా, హీరో మోటోకార్ప్‌కు తీవ్రమైన పోటీనిచ్చింది.
హోండా రికార్డుల మోత
ఏప్రిల్ 2025లో హోండా హీరోను వెనక్కి నెట్టింది. మొత్తం 4,80,896 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఇందులో 4.22 లక్షల యూనిట్లు దేశీయ అమ్మకాలు కాగా, 57,965 యూనిట్లు ఎగుమతులు ఉన్నాయి. అదే సమయంలో హీరో మోటోకార్ప్ మొత్తం అమ్మకాలు 3,05,406 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో దేశీయంగా 2,88,524 యూనిట్లు అమ్ముడవ్వగా, కేవలం 16,882 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేయగలిగింది. ఈ విధంగా హోండా అమ్మకాలు హీరో కంటే 1,75,490 యూనిట్లు అధికంగా ఉన్నాయి. హీరో అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి కంపెనీ తన ధారుహేడా, గురుగ్రామ్, హరిద్వార్, నీమరాణా ప్లాంట్‌లలో ఏప్రిల్ 17-19 వరకు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయడం.
నెం.1 కావడమే లక్ష్యం
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ద టూ-వీలర్ కంపెనీగా ఉంది. అమ్మకాల విషయంలో హీరో మోటోకార్ప్‌తో స్వల్ప తేడాతో వెనుకబడి ఉంది. దీంతో కంపెనీ ఎలాగైనా ఇండియాలో నెం.1 టూ-వీలర్ సంస్థగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ప్రారంభం కంపెనీకి బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.
స్కూటర్లతో షాక్
హోండా, హీరో హోండా నుండి విడిపోయిన సమయంలో ఇండియన్ మార్కెట్‌లో బైక్‌ల హవా కొనసాగుతోంది. స్కూటర్ల మార్కెట్ దాదాపుగా కనుమరుగైపోయింది. అలాంటి సమయంలో హోండా ముందే హోండా యాక్టివా వంటి ఆటోమేటిక్ స్కూటర్‌ను విడుదల చేసి మార్కెట్లో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత టీవీఎస్, హీరో కూడా యాక్టివా విజయాన్ని అనుసరించాయి. నేడు యాక్టివా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా కొనసాగుతోంది.
Also Read : హీరో నుంచి మరో రెండు కొత్త బైక్స్..ఫీచర్స్ వింటే పిచ్చెక్కాల్సిందే