Homeటాప్ స్టోరీస్Hero Destini 110 : హీరో డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్ లాంచ్.. కొత్త కలర్స్,...

Hero Destini 110 : హీరో డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్ లాంచ్.. కొత్త కలర్స్, అదిరిపోయే రెట్రో లుక్.. ఫీచర్లు చూస్తే కొనేస్తారు

Hero Destini 110 : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత మార్కెట్లో మరో కొత్త స్కూటర్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తన పాపులర్ స్కూటర్ డెస్టిని 110 (Destini 110)లో క్లాసిక్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. కొత్త కలర్స్, ఆకర్షణీయమైన డిజైన్, ప్రత్యేకమైన క్రోమ్ ఫినిషింగ్‌తో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త Hero Destini 110 Classique Edition ధరను రూ.76,400 […]

Hero Destini 110 : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత మార్కెట్లో మరో కొత్త స్కూటర్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తన పాపులర్ స్కూటర్ డెస్టిని 110 (Destini 110)లో క్లాసిక్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. కొత్త కలర్స్, ఆకర్షణీయమైన డిజైన్, ప్రత్యేకమైన క్రోమ్ ఫినిషింగ్‌తో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త Hero Destini 110 Classique Edition ధరను రూ.76,400 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న VX వేరియంట్‌తో పోలిస్తే ఈ కొత్త ఎడిషన్ ధర రూ.1,400 ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న హీరో షోరూమ్‌లలో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.

కొత్త కలర్స్‌తో క్లాసిక్ లుక్

హీరో డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్ ప్రధానంగా కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో వచ్చింది. ఇందులో మూడు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. మ్యాట్ గోల్డ్‌ఫిష్ సిల్వర్, లైట్ ఇండస్ట్రియల్ గ్రే, మ్యాట్ ఏరీస్ బ్రౌన్ రంగుల్లో ఈ స్కూటర్ లభిస్తుంది. సిల్వర్, గ్రే కలర్ మోడళ్లకు బ్రౌన్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్ అందించగా.. బ్రౌన్ కలర్ స్కూటర్‌కు బ్లాక్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్ ఇచ్చారు.

అంతేకాకుండా బాడీ కలర్‌కు సరిపోయే రియర్ వ్యూ మిర్రర్స్, ప్రత్యేకమైన సీట్ కలర్, బ్రాండెడ్ రిమ్ టేప్ వంటి మార్పులు చేశారు. ఫ్రంట్ హ్యాండిల్ కవర్, సైడ్ ప్యానెల్స్‌పై ఆకర్షణీయమైన స్ట్రైప్స్ ఇచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన 3D క్లాసిక్ ఎడిషన్ బ్యాడ్జ్‌తో పాటు క్రోమ్ డీటైలింగ్ ఈ స్కూటర్‌కు నియో-రెట్రో లుక్‌ను అందిస్తున్నాయి.

ధరలు, వేరియంట్ల వివరాలు

హీరో డెస్టిని 110 ఇప్పటికే VX, ZX వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో VX వేరియంట్ ధర రూ.75,000 కాగా, కొత్త క్లాసిక్ ఎడిషన్ ధర రూ.76,400గా ఉంది. టాప్ ఎండ్ ZX వేరియంట్ ధర రూ.83,800గా నిర్ణయించారు. అంటే ZX వేరియంట్‌తో పోలిస్తే కొత్త క్లాసిక్ ఎడిషన్ రూ.7,400 తక్కువ ధరకు లభిస్తోంది.

ఇంజిన్, పనితీరు ఎలా ఉందంటే?

ఈ కొత్త ఎడిషన్‌లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 110.9 సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 7,250 ఆర్పీఎం వద్ద 8.15 పీఎస్ పవర్‌ను, 5,750 ఆర్పీఎం వద్ద 8.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ CVT గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ పనిచేస్తుంది. హీరోకు చెందిన i3S ఐడిల్ స్టాప్-స్టార్ట్ టెక్నాలజీని కూడా ఇందులో కొనసాగించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనం ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగి, మళ్లీ యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు స్టార్ట్ అయ్యే విధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది.

ఫీచర్లు, బ్రేకింగ్ సిస్టమ్

డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్ VX వేరియంట్ ఆధారంగా రూపొందింది. అందువల్ల ముందు, వెనుక రెండు చక్రాలకు డ్రమ్ బ్రేకులు ఇచ్చారు. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) కూడా అందుబాటులో ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మాత్రం టాప్ ఎండ్ ZX వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్‌ను అమర్చారు. రెండు వైపులా 12 ఇంచుల అల్లాయ్ వీల్స్ అందించారు. వెనుక చక్రానికి 100/80-12 టైర్‌ను ఉపయోగించారు.

ఈ స్కూటర్‌లో 785 మిల్లీమీటర్ల పొడవైన సీటు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తమ సెగ్మెంట్‌లో ఇదే అత్యంత పొడవైన సీటు అని హీరో కంపెనీ పేర్కొంటోంది. స్టోరేజ్ విషయానికి వస్తే సీటు కింద 19 లీటర్ల సామర్థ్యం కలిగిన స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇందులో బూట్ ల్యాంప్ కూడా ఉంటుంది. ముందు భాగంలో మొబైల్ ఛార్జింగ్ సదుపాయంతో కూడిన స్టోరేజ్ ఏరియాను అందించారు.

అదనపు ఫీచర్లు ఇవే!

ఫీచర్ల పరంగా డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్స్, LED పొజిషన్ ల్యాంప్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే హీరో డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్‌లో ఇంజిన్, మెకానికల్ అంశాల్లో పెద్దగా మార్పులు లేకపోయినా.. కొత్త రంగులు, క్రోమ్ ఫినిషింగ్, ప్రత్యేకమైన బ్యాడ్జింగ్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. తక్కువ ధరలో స్టైలిష్ రెట్రో లుక్‌తో కూడిన 110 సీసీ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కొత్త ఎడిషన్ మరో ఆప్షన్‌గా నిలవనుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper