Gold Price Today: బంగారం ధరలు మరోసారి తగ్గాయి. మొన్న రూ.1000 తగ్గి.. నిన్న రూ.700 పెరిగే సరికి కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈరోజు రూ.500 తగ్గడంతో కాస్త ఊరటనిచ్చినట్లయింది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2302 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ఔన్స్ కు 26.56 డాలర్లుగా నమోదైంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 4న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.71,730 గా ఉంది. మే 3న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,250తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.500 తగ్గింది . దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,890 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.71,870 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,750 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.71,730 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,160తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,730తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,750తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,730తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు స్థిరంగానే కొనసాగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.83,500గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధరలు స్థిరంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.83,500గా ఉంది. ముంబైలో రూ.83,500, చెన్నైలో రూ.87,000, బెంగుళూరులో 82,150, హైదరాబాద్ లో రూ.87,000తో విక్రయిస్తున్నారు.