Gold Price Today: బంగారం ధరల తగ్గింపు ఒక్కరోజు మురిపమేనా? అన్నట్లు సాగుతోంది. నిన్న ఏకంగా రూ. 1000 తగ్గిన బంగారం ఈరోజు మళ్లీ పెరిగింది. అటు వరుసగా తగ్గిన వెండి సైతం మరోసారి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2304 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ఔన్స్ కు 26.70 డాలర్లుగా నమోదైంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 3న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,270 గా ఉంది. మే 1న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..65,550తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి బుధవారంతో పోలిస్తే గురువారం రూ.700 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,410 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,430 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,260 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,280 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,160 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,260తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,260 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,280తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,260తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,280తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.83,500గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.500 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.83,500గా ఉంది. ముంబైలో రూ.83,500, చెన్నైలో రూ.87,100, బెంగుళూరులో 82,150, హైదరాబాద్ లో రూ.87,100తో విక్రయిస్తున్నారు.