Gold Rates In Holy
Gold Price Today: హోలీ పండుగ వేళ బంగారం ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గి ఊరటనిచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 25న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.66,810 గా ఉంది. మార్చి24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,250తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి ఆదివారంతో పోలిస్తే సోమవారం రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,390 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.67,460గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,240 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.66,810 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,840 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.67,450తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,240 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,810తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.61,240తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,810తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరతో పాటు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.77,400గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం రూ.100 తగ్గింది . న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.77,400గా ఉంది. ముంబైలో రూ..77,400, చెన్నైలో రూ.80,400, బెంగుళూరులో 75,900, హైదరాబాద్ లో రూ.80,400తో విక్రయిస్తున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Gold rates today gold prices eased during the holi festival
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com