Gold Price Today: బంగారం ధరలు గుడ్ న్యూస్ చెప్పినా.. వెండి ధరలు మాత్రం షాక్ ఇచ్చాయి. కొన్ని రోజులుగా బంగారం తగ్గుతూ స్థిరంగా కొనసాగుతోంది. వెండి మాత్రం ఈరోజు రూ.500 పెరిగింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 2328 డాలర్లుగా నమోదైంది. స్పాట్ సిల్వర్ 83.50 డాలర్లుగా కొనసాగుతోంది. దేశీయంగా బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 19న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,220 గా ఉంది. జూన్ 18న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,300తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.100 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,460గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,200 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,220 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,950 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,050తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,220తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,200తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,220తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.91,500గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.500 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.91,500గా ఉంది. ముంబైలో రూ.91,500, చెన్నైలో రూ.96,100 బెంగుళూరులో 90,900, హైదరాబాద్ లో రూ. 96,100 తో విక్రయిస్తున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More