Homeబిజినెస్Gold prices low in these countries : ఈ దేశాల్లో బంగారం ధరలు...

Gold prices low in these countries : ఈ దేశాల్లో బంగారం ధరలు తక్కువ.. ఎంత వీలైతే అంత కొనేయండి.. మరి దీనిని ఎలా తీసుకురావాలి?

Gold prices low in these countries : భారత్ లో బంగారంనకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు తులం కొందామంటే చుక్కలు కనిపిస్తున్నాయి. శుభకార్యాలు, ఇతర అవసరాలకు బంగారం అవసరం ఉన్నా.. ధరల కారణంగా తక్కువే కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. ఈ తరుణంలో బంగారం ధరలు తక్కువగా ఎక్కడుండే అక్కడ కొనుగోలు చేయాలని చూస్తుంటారు. బంగారానికి భారత్ ఉన్న డిమాండ్ ఇతర దేశాల్లో ఉండదు. దీంతో కొన్ని దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. అయితే అక్కడి నుంచి కూడా బంగారం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎలా తీసుకురావాలి?

Also Read: 500 రూపాయల నోటు రద్దు కాబోతోందా? మళ్లీ ఏం జరుగుతోంది?

భారత్ లో ప్రస్తుతం బంగారం ధరలు.. జూలై 14 ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.91,550గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం కొనాలంటే రూ.99,880 చెల్లించాలి. అయితే మాలావి, ఇండోనేషియా, థాయిలాండ్, దక్షిణాఫ్రికాతో పాటు అరబ్ దేశాల్లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. మాలావి దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.72,460 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.79,400 గా ఉన్నాయి. ఇండోనేషియాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,880 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,250గా ఉంది. థాయ్ లాండ్ దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,070 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.90,750 గా ఉంది. దక్షిణాఫ్రికాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.26,397 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,799గా నమోదైంది. ఇక దుబాయ్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.93,280గా పలుకుతోంది.

Also Read: గ్రామీణ రైతులకు శుభవార్త.. రూ.5 లక్షల వరకు లోన్.. అర్హులు ఎవరంటే?

ఆయా దేశాల నుంచి బంగారం ను మనదేశంలోకి తీసుకురావొచ్చు. అయితే ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. విదేశాల నుంచి 20 గ్రాముల బంగారం తన వెంట తీసుకొని రావొచ్చు. మహిళలు ఆభరణాలు అయితే 40 గ్రాముల వరకు మినహాయింపు ఉంటుంది. దుబాయ్ నుంచి భారత్ కు ఎక్కువగా రాకపోకలు సాగుతూ ఉంటాయి. దీంతో ఇక్కడి నుంచి బంగారం ను భారత్ కు తీసుకొస్తూ ఉంటారు. అలాగే థాయ్ లాండ్ కూడా బంగారం విక్రయాలకు ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్లిన వారు సైతం బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం ను దేశంలోకి బిస్కెట్ల రూపంలో తీసుకురావాలంటే బిల్లులు తప్పనిసరిగా ఉండాలి. పరిమితికి మించిన బంగారం ఉంటే కస్టమ్స్ అధికారులు ఆధీనంలోకి తీసుకుంటారు. ఆభరణాల రూపంలో అయితే బిల్లులు లేకపోయినా పర్వాలేదు.

భారత్ లో బంగారం ధరలు రోజరోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఎక్కువగా డిమాండ్ ఉండడంతో చాలా మంది వివిధ మార్గాల ద్వారా బంగారం తీసుకువస్తూ ఉంటారు.కానీ ఇలా తేవడం చట్టరీత్యా నేరం. అక్రమంగా బంగారం తీసుకువస్తూ పట్టుబడితే జైలు శిక్ష ఉంటుంది. అందువల్ల అవసరమైన మేరకు మాత్రమే బంగారం తీసుకురావాలి. మీరు ఎప్పుడైనా దుబాయ్ లేదా థాయ్ లాండ్ వెళ్లినప్పుడు బంగారం అనుమతి తో పరిమితుల మేరకు మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి..

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper