Gold – Silver Price Today : బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి ఇది శుభవార్తే. బులియన్ మార్కెట్ ప్రకారం బంగారం ధరలు పెరుగుదల ప్రారంభమైంది. గత వారం రోజులుగా బంగారం ధరలు పడిపోతూ వస్తున్నాయి. శనివారం మాత్రం 10 గ్రాములకు రూ.100 పెరిగింది. దీంతో ఇక నుంచి బంగారంధరలు పెరుగుతాయని, ఇది పెట్టుబడి దారులకు అనుకూలమని అంటున్నారు. అయితే కొన్ని నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం అక్టోబర్ 7న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములను రూ.57,230 కి దిగింది. అక్టోబర్ 6న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,400తో విక్రయించారు. శుక్రవారం కంటే శనివారం రూ.100 మేర పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇక్కడ రూ.52,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.57,380గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,500 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.57,230 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,650తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,230తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,500తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,230తో విక్రయిస్తున్నారు.
అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.. శుక్రవారం దాదాపు రూ.500 మేర తగ్గి ప్రస్తుతం కిలో వెండి రూ.70,600తో విక్రయిస్తున్నారు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.70,600గా నమోదైంది. చెన్నైలో రూ.73,000, బెంగుళూరులో 68,800, హైదరాబాద్ లో రూ.73,000తో విక్రయిస్తున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Gold price silver rates today 07 october 2023 in india telangana andhra hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com