Reason for gold price rise: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో బంగారం ధరలు కొన్ని రోజులపాటు మాత్రమే పెరిగేవి. ఆ తర్వాత సీజన్ లేనప్పుడు ధరలు స్థిరంగా ఉండేవి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పండుగల సీజన్ ఏర్పడిన తర్వాత డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బంగారం ధరలు పెరుగుతాయని భావించేవారు. కానీ ప్రస్తుతం అన్నివేళలా బంగారం ధరలు పెరగడమే గాని తగ్గడం లేదు. ఎవరు ఊహించని విధంగా లక్ష రూపాయల వరకు చేరుకుంటే.. ఇక బంగారం ధరలు అక్కడితో ఆగిపోతాయని అనుకున్నారు. కానీ అక్కడితో ఆగకుండా లక్షలు 20వేల వరకు బంగారం చేరి షాకింగ్ న్యూస్ చెప్పాలి. అసలు బంగారం ధరలు ఇలా వరుసగా పెరగడానికి కారణం ఏంటి? ఎప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతాయి?
బంగారం లోహానికి భారతదేశంలో డిమాండ్ ఎక్కువ. కానీ వీటి ధరల ప్రభావం మాత్రం అంతర్జాతీయంగా ఉన్నా పరిస్థితి కారణమని తెలుస్తోంది. మిగతా దేశాల్లో బంగారం ను ఎక్కువగా ఉపయోగించారు. కానీ దీనిపై పెట్టుబడులు పెట్టడానికి మాత్రం చాలా మంది ఈ మధ్య ఆసక్తి చూపుతున్నారు. మనం ఉపయోగించే బంగారం అమెరికాలోని డాలర్ ను పడగొట్టే స్థాయికి ఎదుగుతుందంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజంగా నిజమే. ఎందుకంటే చాలామంది ఇప్పుడు డాలర్ కంటే బంగారం మాత్రమే సేఫ్ అయిన పెట్టుబడి అని భావిస్తున్నారు. అందుకే అంతర్జాతీయంగా చాలామంది పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.
ఇంకా బంగారం ప్రస్తుతం రూ.1,20,000 వరకు చేరుకుంది. ఇది రాను రాను రెండు లక్షల వరకు కూడా చేరే అవకాశం ఉందని కొందరు అంతరా వేస్తున్నారు. అయితే ఆ స్థాయికి చేరుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రస్తుత పెరుగుదలను చూస్తే ఖచ్చితంగా రెండు లక్షల వరకు చేరడం ఖాయం అని తెలుస్తోంది. దీంతో కొంతమంది భారతదేశంలో ఉన్నవారు సైతం ఇప్పుడే బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో బంగారం కొంటామో? లేదో? అన్న భయంతో కూడా కొనుగోలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా బంగారంనకు డిమాండ్ పెరుగుతుంది.
భారతదేశంలో బంగారం పెట్టుబడి కోసం అని కాకుండా వీటిని ధరించడానికి కూడా కొనుగోలు చేస్తారు. అయితే నేటి కాలంలో మాత్రం ఎక్కువ శాతం పెట్టుబడులు పెడుతున్నారు. మిగతా వాటికంటే ఇందులో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమా? ఒకవేళ భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉందా? అన్న భయం కూడా కొందరిలో ఉంది. కానీ పరిస్థితులను చూస్తే మాత్రం బంగారం ధర పడిపోయే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా భవిష్యత్తులో బంగారం విలువ మరింతగా పెరిగి సామాన్యులకు దొరికే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. అందువల్ల బంగారం విషయంలో చాలామంది అప్రమత్తమై ఇప్పుడే తమకు కావాల్సినంత కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు.