Homeబిజినెస్సులభంగా రూ.5 లక్షల లోన్.. 6 నెలలు ఈఎంఐ కట్టకుండా..?

సులభంగా రూ.5 లక్షల లోన్.. 6 నెలలు ఈఎంఐ కట్టకుండా..?

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో ఒకటైన కెనరా బ్యాంక్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కొత్త లోన్ స్కీమ్స్ ను అమలులోకి తెచ్చింది. కెనరా బ్యాంక్ హెల్త్ కేర్ క్రెడిట్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్ కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తుండగా రుణాలు తీసుకోవాలని భావించే వాళ్లకు ఈ ఆఫర్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కరోనా సమయంలో చాలామందికి ఈ లోన్ వల్ల మేలు జరగనుంది.

రిజిస్టర్డ్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్స్, ఇతరులు కెనరా చికిత్స హెల్త్‌కేర్ క్రెడిట్ ఫెసిలిటీ కింద 10 లక్షల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల వరకు సులభంగా రుణం పొందే అవకాశం ఉంటుంది. కెనరా బ్యాంక్ తక్కువ వడ్డీరేట్లకే ఈ లోన్లను అందిస్తుండటం గమనార్హం. ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్లు 10 ఏళ్లలో రుణాన్ని తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఈ లోన్ ను తీసుకున్న వాళ్లు ఏకంగా 18 నెలల వరకు మారటోరియం ను పొందవచ్చు.

మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు తయారు చేసే సంస్థలకు కెనరా బ్యాంక్ ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు రుణాలను అందిస్తుండటం గమనార్హం. కెనరా జీవన రేఖ హెల్త్ కేర్ బిజినెస్ లోన్ కింద ఈ రుణాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలు పొందిన వాళ్లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. కెనరా బ్యాంక్ 5 లక్షల రూపాయల వరకు పర్సనల్ లోన్స్ ను కూడా అందిస్తోంది.

కెనరా సురక్ష పర్సనల్ లోన్ స్కీమ్ కింద ఈ రుణాలను పొందే అవకాశం ఉంటుంది. 6 నెలలు ఈఎంఐ కట్టకుండా రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండగా ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper