Homeబిజినెస్Best Business Ideas: అద్భుతమైన బిజినెస్ ఐడియాలు ఇవే.. నెలకు లక్ష ఈజీగా సంపాదించవచ్చు…

Best Business Ideas: అద్భుతమైన బిజినెస్ ఐడియాలు ఇవే.. నెలకు లక్ష ఈజీగా సంపాదించవచ్చు…

Best Business Ideas: ఇంట్లో కూర్చొని లాప్ టాప్ లేదా ఫోన్ తో మంచి ఆదాయం పొందవచ్చు. నెల రోజుల్లో ఒక్క లక్ష రూపాయలు ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నావారికి ప్రస్తుతం చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కొంచెం క్రియేటివిటీ ఉంటే నెలకు లక్ష రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. ఈ క్రమంలోనే చాట్ జిపిటి ఇచ్చిన కొన్ని అద్భుతమైన ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపారాలు ఇవే. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఆన్లైన్ ఆధారంగా ఉండే వ్యాపారం అని చెప్పొచ్చు. దీనికోసం మీరు మీ అఫీలియేట్ ఖాతాను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. వాటికి సంబంధించిన లింకులను మీరు మీ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తే మీరు షేర్ చేసిన లింకు ద్వారా ఎవరైనా వస్తువు కొన్నప్పుడు దానికి సంబంధించిన కమిషన్ మీకు వస్తుంది. దీనికోసం మీరు ఉత్పత్తులు కొని స్టాక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

Also Read: The right way to invest : పెట్టుబడి పెట్టడానికి సరైన మార్గం: మీ ఆర్థిక స్వేచ్ఛకు SWP ముఖ్యమైనదా?

కేవలం ఆ ఉత్పత్తులను మీరు మీ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంటి దగ్గర నుంచి యూట్యూబ్ షాట్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ వంటివి కూడా చేసి మంచి ఆదాయం పొందవచ్చు. వీటిని బాగా ప్రమోట్ చేస్తే మీరు లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. మరొక బిజినెస్ ఐడియా క్యాటరింగ్ లేదా హోమ్ టిఫిన్ సెంటర్. ఇది చాలా ప్రాధాన్యత పొందిన బిజినెస్. మీరు ఇంట్లో వంట చేసి చిన్న టిఫిన్ సెంటర్ వంటిది పెట్టుకుని క్లౌడ్ కిచెన్ గా కూడా మార్చుకోవచ్చు. జొమాటో, స్విగ్గి వంటి ఫుడ్ డెలివరీ ఆప్ లతో కలిసి మీరు పని చేయవచ్చు. కాస్త జాగ్రత్తగా మెనూ ప్లాన్ చేసి మంచి టేస్ట్ అందిస్తే మీరు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ వ్యాపారంలో బాగా ఆదాయం పొందవచ్చు. కనీసం రోజుకు మూడు వేల చొప్పున మీరు ఒక నెల రోజులపాటు చేసినట్లయితే లక్ష రూపాయల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు.

Also Read: Are you speed dating: స్పీడ్ డేటింగ్ చేస్తున్నారా? ఇందులో మంచి భాగస్వామి నిజంగానే దొరుకుతారా? లేదా జీవితాన్నే మిస్ అవుతామా?

అలాగే సోషల్ మీడియాలో ప్రమోషన్ బిజినెస్ కూడా ప్రస్తుతం బాగా ప్రాధాన్యత పొందింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫామ్ లలో క్రియేటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో మీరు వీడియోలను ఎడిట్ చేయడానికి కన్వా, కాప్ కట్, వీఎన్ వంటి యాప్స్ ఉపయోగించి కూడా వీడియోలను ఆకర్షణీయంగా డిజైన్ చేసి కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. ఒక్కొక్క వీడియోకు మీరు రూ.500 రూపాయల నుంచి రూ.1500 రూపాయల వరకు కూడా వసూలు చేయవచ్చు. ప్రతిరోజు మీరు కనీసం రెండు నుంచి మూడు వీడియోలు ఎడిట్ చేసినా కూడా నెలకు ఒక లక్ష రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper