Mirai Teaser : ‘హనుమాన్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన చిత్రం ‘మిరాయ్'(Mirai Movie). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసుకుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగష్టు 1న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ VFX వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉండడం తో సెప్టెంబర్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా క్వాలిటీ అంటే, వందల కోట్లు బడ్జెట్ ని ఖర్చు చేయకుండా, మీడియం రేంజ్ బడ్జెట్ తో ఇలాంటి క్వాలిటీ సినిమాలు తీయడం సాధారణమైన విషయం కాదు, అందుకు ఎంతో నైపుణ్యం ఉండాలని ఈ టీజర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : మిరాయ్ లో మంచు మనోజ్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు…
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్(Manchu Manoj) విలన్ గా నటించాడు. టీజర్ లో చూసినప్పుడు ఆయన క్యారక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నట్టు గా అనిపించింది. ‘జరగబోతున్నది మారణ హోమం..శిథిలం అవ్వబోతున్నది అశోకుడి ఆశయం..కలియుగం లో పుట్టిన ఏ శక్తి దీనిని ఆపలేదు’ అనే డైలాగ్ తో బ్యాక్ గ్రౌండ్ లో చూపించిన విజువల్స్ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఇదంతా విలన్ క్యారక్టర్ చేస్తున్న మనోజ్ గురించి వివరణ అన్నమాట. ఇక ఆ తర్వాత మంచు మనోజ్ ఎంట్రీ, ఆయన చేసే యాక్షన్ సన్నివేశాలు, పలికిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘ఈ ప్రమాదాన్ని ఆపే దారి లేదా’,’ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనుక అవతరించిన ఒక ఆయుధం చూపిస్తుంది..అదే మిరాయ్’ అనే డైలాగ్స్ ని చూస్తుంటే సినిమాలో చాలా డెప్త్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే హనుమాన్ చిత్రం లో హీరో తేజ సజ్జ చేతిలో ఎలా అయితే హనుమంతుడి అంశతో కూడిన రాయి దొరికినప్పుడు వెయ్యి ఏనుగుల బలం వచ్చేదో, ఈ చిత్రం లో కూడా హీరో కి మిరాయ్ అనే ఆయుధం తనతో ఉన్నంతసేపు కొండంత బలం ఉన్నట్టుగా చూపించారు. ఈ రెండు అంశాలు ఈ రెండు చిత్రాల్లో కామన్ గా అనిపించింది. కానీ ఈ చిత్రం లో బ్యాక్ స్టోరీ చాలానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. దానిని పర్ఫెక్ట్ గా చూపిస్తే సినిమా వేరే లెవెల్ కి రీచ్ అయ్యేలా అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఈ రేంజ్ క్వాలిటీ సినిమాలు చేస్తూ, ఎవరికీ అందనంత రేంజ్ కి తేజ సజ్జ రాబోయే రెండు మూడు ఏళ్లలోనే వెళ్లేట్టుగా అనిపిస్తున్నాడు. వందల కోట్లు ఖర్చు చేసిన రాని క్వాలిటీ ప్రొడక్ట్స్, ఈ హీరోకి చాలా సులువుగా వచ్చేస్తున్నాయి, ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.