Homeబిజినెస్అమెజాన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. నెలరోజుల డీల్స్?

అమెజాన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. నెలరోజుల డీల్స్?

Amazon to host great Indian festival from oct 4 ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో భాగంగా తాజగా తేదీలను ప్రకటించింది. అక్టోబర్ నెల 4వ తేదీన ఈ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ముందుగానే డీల్స్ అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఫ్లిప్ కార్ట్ వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్ ను నిర్వహించనుంది.

అమెజాన్ కస్టమర్లకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలపై భారీగా డిస్కౌంట్లను అందించనుందని తెలుస్తోంది. కిండ్లే, ఫైర్ స్టిక్, అమెజాన్ ఎకో డివైజ్ లను కూడా తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చెందిన వెయ్యికి పైగా ఉత్పత్తులను గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో భాగంగా లాంఛ్ చేయనున్నారని సమాచారం. హెచ్డీఎఫ్సీ కార్డు ఉన్న కస్టమర్లకు స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

హెచ్.డీ.ఎఫ్.సీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఈ.ఎం.ఐ లావాదేవీలపై ఏకంగా 10 శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు నో కాస్ట్ ఈ.ఎం.ఐతో పాటు క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. దసరా, దీపావళి పండుగ కానుకగా అమెజాన్ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. అమెజాన్ నెల రోజుల పాటు ఈ సేల్ ను నిర్వహిస్తుండటం గమనార్హం.

అమెజాన్ ఇప్పటికే డెలివరీ మౌఖిక సదుపాయాలను సైతం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. అమెజాన్ ఏకంగా నెల రోజుల పాటు సేల్ ను నిర్వహిస్తుండటంతో కస్టమర్లకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Christopher Nolan

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Dhanush

Dhanush: విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ అయిపోతారా..వీడియో వైరల్

Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో...
Nagendra Sai

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Oktelugu Epaper