Amazon Great Indian Festival : పండుగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. అమెజాన్ నిర్వహించనున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఏడాదిలో అమెజాన్ నిర్వహించే అతిపెద్ద ఫెస్టివ్ సేల్ ఈవెంట్లలో ఇది ఒకటి. ఈ సేల్‌లో బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల వరకు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కూపన్లు, నో-కాస్ట్ EMI వంటి ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందొచ్చు.
ఈ సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లలో Samsung Galaxy S25 Ultra ఒకటి. అమెజాన్ ప్రకారం కూపన్ ఆఫర్‌ను కలుపుకుని ఈ ఫోన్ రూ.84,999 ఎఫెక్టివ్ ధరకు లభించనుంది. అలాగే 9 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది. కాగా Galaxy S25 Ultra భారత్‌లో 12GB RAM, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌కు రూ.1,29,999 ప్రారంభ ధరతో విడుదలైంది.
మరోవైపు iPhone 16 కూడా భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానుంది. రూ.89,900 లిస్టెడ్ ధర ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం రూ.71,999 ధరకు లభించనుంది. అందుబాటులో ఉన్న అన్ని ఆఫర్లను కలిపిన తర్వాత ఈ ధర వర్తిస్తుంది.
మిడ్‌రేంజ్ విభాగంలో OnePlus Nord 6 రూ.52,999 నుంచి తగ్గి రూ.42,999కు లభించనుంది. క్రెడిట్ కార్డు EMI బ్యాంక్ ఆఫర్‌తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం ఉంది. iQOO 15R కూడా రూ.69,999 నుంచి రూ.46,499 ఎఫెక్టివ్ ధరకు అందుబాటులో ఉంటుంది. కూపన్ ఆఫర్‌తో పాటు 3 నెలల వరకు నో-కాస్ట్ EMI పొందొచ్చు.
ఇక ప్రీమియం ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకునే వారికి Xiaomi 17 ఆఫర్ ఆసక్తికరంగా ఉంది. రూ.1,19,999 లిస్టెడ్ ధర నుంచి తగ్గి రూ.59,999కు లభించనుంది. క్రెడిట్ కార్డు EMI ప్రయోజనంతో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఉంది.
బడ్జెట్ విభాగంలో iQOO Z11xa రూ.40,999 నుంచి రూ.24,999కు, Redmi 15C 5G Prime రూ.29,999 నుంచి రూ.15,999కు లభించనున్నాయి. ఇవే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.70,000 వరకు ఆదా, రూ.2,944 నుంచి నో-కాస్ట్ EMI, కూపన్ల ద్వారా రూ.7,500 వరకు అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. SBI డెబిట్, క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు EMI లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.