డిసెంబర్ 8న(రేపు) భారత్ బంద్ కు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. వ్యవసాయ సంస్కరణ పేరిట కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గడిచిన 11రోజులుగా ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు.
Also Read: భారత్ బంద్ పై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
ఈక్రమంలోనే రైతులకు కేంద్రానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదు. ఓవైపు చర్చలు జరుగుతుండగానే రైతు సంఘాల నాయకులు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్.. కాంగ్రెస్.. టీడీపీలు సైతం భారత్ బంద్ కు మద్దతు తెలిపారు. భారత్ బంద్ ను విజయంతం చేయాలని ఇప్పటికే ఆయా పార్టీలు శ్రేణులకు పిలుపునిచ్చాయి.
Also Read: ‘భారత్ బంద్’పై కొర్రీలు పెడుతున్న మమతా బెనర్జీ..!
రేపు భారత్ బంద్ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా పలు సూచనలు చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాన్నారు. ఇక ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్స్‌లు.. ఇతర సర్వీసులు యధావిథిగా నడుస్తాయని తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తితే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 040-2785 3413, 040-2300 2424, 9490617100, 8500411111లకు సంప్రదించాలని కోరారు. బంద్ నేపథ్యంలో వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Bharat bandh traffic police alerting motorists
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com